పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కున్నారు. విగ్ట్‌ద్వీపంలో 'హనీమూన్‌' గడిపారు. అంకుల్ లాడర్, మరొక మారిసన్ కజిను అక్కడికి కొలదికాలం విహారయాత్ర కోసం వచ్చారు. అంకుల్ లాడర్ వారికోసం స్కాట్లండ్ లోని గ్రాంపియన్ కొండల్లోని గ్రాంటుల పూర్వీకుల ఇల్లయిన కిల్‌గ్రాష్టన్ కాజిల్‌ను వేసవిగృహంగా ఉపయోగించుకోటానికి అద్దెకు సంపాదించి పెట్టాడు. ఉత్తర దిక్కుగా పయనిస్తున్నప్పుడు మార్గమధ్యంలో వారు పూర్వం నగరానికి వచ్చిన గ్రంథాలయానికి కార్నెగీ శంఖుస్థాపన చేసిన ఎడింబరోలో ఆగారు. అతనికి "ప్రీడమ్ ఆఫ్ ది సిటీ" అనే గౌరవాన్ని ప్రసాదిస్తున్నప్పుడు లార్డు సాలిస్ బరీ ముఖ్య ప్రసంగం చేశాడు. ఎడింబరోనుంచి వారు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు వెళ్లారు. అక్కడ వధువు ఆ నగరాన్ని, బంధువర్గాన్ని చూసి ఆనందించింది. బంధువర్గంకూడా ఆమెను చూచి యెంతో సంతోషించారు. వాళ్ళలో చాలామంది ఆమె భర్తతో అన్నారు. "ఆండ్రూ! ఆమె నిన్ను వివాహం చేసుకొన్నందుకు నా కాశ్చర్యంగా ఉంది" అని. అందుకు అతడు "మీరు నాకంటే విశేషమైన ఆశ్చర్యాన్ని పొంది ఉండరు!" అని ప్రతిభాషణం చేశాడు.

ఈ వివాహంకంటే ఏదీ ఆనందప్రదంగా వుండదు. మిసెస్ కార్నెగీ తనకంటెకూడా ఎక్కువ స్కాబ్ అయిపోతున్నదని ఆమె భర్తే అన్నాడు. ప్రాత నగరాలు, కొండలు, సరస్సులు, పూలు అన్నీ ఆమెకు సంతోషప్రదాలైనాయి. ఆమెకు ముఖ్యంగా బాగ్‌పైప్ సంగీతమంటే ఇష్టం కలిగింది. నిద్ర మేల్కొనేటప్పటికల్లా ప్రతిదినం బాగ్‌పైప్ సంగీత