పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్ఞుడు తమకు పాడుకుంటూ ఎదురురావటం, భోజనవేళల్లో ఆ వాద్య సంగీతాన్ని వినిపించటం ఎంతో ఉల్లాసకరాలుగా ఉంటాయని ఆమె సూచించింది. ఆమె కోర్కె వెంటనే తీర్చబడింది. తన శాఖకంతటికీ ప్రముఖుడయిన క్లరీమెక్ఫర్ సన్ గొప్పగా సిఫారసు చేస్తూ ఒక లేఖను వ్రాసియిచ్చి పైపరొకణ్ణి కార్నెగీల దగ్గరికి పంపించాడు. వారు కిల్గ్రాష్టన్ దుర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు తన సంగీతంతో అతడు వారికి ముందు నడిచాడు.

ఆ వేసగి ఎంతో సంతోషంగా గడిచిపోయింది. గుంపులు గుంపులుగా అతిధులు వారి సౌధంలో మూగుతున్నారు. డన్ఫ్‌ర్మ్‌లైన్ బంధువర్గంకూడా వారితో చేరారు. వీరందరూ వస్తూ పోతూ ఉండటంతో కాలం గడచిపోతూండది. ఆకురాలు కాలంలో కార్నెగీలు న్యూయార్కుకు తిరిగి వచ్చేటప్పుడు వెంట పైపరునుకూడా తీసుకువచ్చారు. ఫిప్టీ ఫస్టు స్ట్రీట్ లో ఫిప్త్ ఎలెన్యూలో అతి విశాలమైనదీ, ఆడంబరం లేనిది అయిన తమ యింట్లో అతణ్ని ఒదిగించటం కొంచెం కష్టమని వారు గమనించినప్పటికీ అతణ్ని తీసుకువచ్చారు. తరువాతవచ్చిన వేసగికు మెక్ ఫర్ సన్ దగ్గరనుంచి క్లనీ కాజిల్‌ను అద్దెకు పుచ్చుకొని అక్కడికి వచ్చినప్పుడు కార్నెగీలు తిరిగి వారి దేశంలోకి వచ్చినట్లు భావించారు. ఇలా వారు పది వేసగి ఋతువులు గడిపారు.

కొన్ని సంవత్సరాలనుంచి కార్నెగీ పెద్దమొత్తాలుగా డబ్బుదానం చేస్తున్నాడు. 1887 లో గ్లాడ్‌స్టన్‌తో ఒకమాటు "ఒక మనిషి ధనికుడిగా మరణించటం అవమానకరమైన