పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్థ లన్నింటికీ అధ్యక్షుడు. అతనికి కుడిభుజం. అతడు లేకుండా జీవితాన్ని ఎలా సాగించాలో అతనికి అర్థంకా లేదు.

కొంతకాలం అతడు ఎంతగానో క్రుంగిపోయాడు. క్రమంగా అతడు శారీరక మానసిక బలాలను రెంటినీ కొద్దిగా పొందుతున్నాడు. అతడికి మరొక "ప్రియతమయిన వ్యక్తి లూయీ విట్ఫీల్డ్. ఆమెను గురించి మరల మరల వచ్చే మనోభావాలను త్రోసిపుచ్చ లేకపోతున్నాడు. బహుశ: ఆమె ఇప్పుడు కొంత దు:ఖపడి వుండవచ్చు. జబ్బునుంచి, దు:ఖం నుంచి తేరుకొని లేచి కూర్చోగలిగిన వెంటనే అతడు తమ ఒప్పందాన్ని పునరుద్ధించవలసిందని కోరుతూ ఒక లేఖ వ్రాశాడు. అతనికి ప్రయాణం చేయగల పరిస్థితి చేకూరింది. అప్పుడు అతనికి వైద్యంచెయ్యటంకోసం ఆహ్వానింపబడ్డ అతి సమర్ధుడయిన న్యూయార్క్ వైద్యుడు డాక్టరు ఎప్. ఎస్ డెన్నీ అతణ్ని న్యూయార్క్‌లోని డెన్నీహోమ్‌కు తీసుకొనిపోయాడు. అక్కడ ఆ వైద్యుడు, అతని భార్య చూపిన శ్రద్ధవల్ల అతడు బాగా కోలుకోవటం జరిగింది. మిసెస్ విట్ఫీల్డు అక్కడికి వచ్చి అతని దుస్థితిని, దైన్యాన్నిచూసి, పున:పరిసీలన చేశానని ఇప్పుడు అతణ్ని వివాహమాడటానికి తన కిష్ట మేనని చెప్పింది. ఆమె అతణ్ని ప్రేమించింది కదా మరి! "ఇప్పుడు నా అవసరం నీ కున్నదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను నీకు నిజమైన సహాయకురాలినిగా ఉండగలను" అని ఆమె అతనితో చెప్పింది.

ఏప్రియల్, 1887 న వా రిరువురూ వివాహం చేసు