పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చిన ఒక యువకుడు హెన్రీ క్లే ఫ్రిల్. ఇతడు తెలివిగా కోల్‌ను నిర్మించటానికి పూనుకొన్నాడు. 1881 వచ్చేటప్పటికల్లా ప్రపంచ మంతటిలోనూ మంచి కోకొంగ్ బొగ్గును తయారుచేసే కోనెల్స విల్లీలోని ఎనభైవంతుల వ్యాపారాన్నంతటినీ ఇతడు హస్తగతం చేసుకొన్నాడు. అయితే చాలా అప్పుల్లో పడ్డాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇతడు ఒక పిట్స్‌బర్గ్ కన్యను వివాహమాడ దలిచాడు. కొంతకాలంనుంచీ కార్నెగీ దృష్టి ఫిల్బ్‌మీద పడ్డది. ఇతణ్ణి భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాడు. సర్వం ఇతనిమీద విడిచిపెట్టి సంస్థకు బయట ఉండదగినంతటి సామర్ధ్యం గలవా డితడు. వీ ళ్ళిరువురూ కలుసుకొని ఒక వ్యాపారపు లొడంబడిక చేసుకున్నాడు. హనీమూన్ కోసం ఫిక్. అతని భార్య న్యూయార్క్‌కు వచ్చినప్పుడు కార్నెగీ వాళ్ళను విందు కాహ్వానించాడు. ఆ సమయంలో తల్లి తప్ప మరెవ్వరూ అతిథులు లేరు. భోజనం ముగియబోయేముందు అతిథేయి లేచి నిలిచి అతడు తన ఉత్తమ మిత్రులైన ఫ్రిక్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పాడు. అందులో "మిష్టఫ్రిక్ నేను భాగస్వాములము కాబోతున్నామని చేర్చాడు.

ఇలా చేర్చి చెప్పటం ఈ రహస్యాన్ని ఇంతవరకూ ఎరగని తల్లి ఉపయోగం కోసమే ఉద్దేశింపబడ్డది.

"ఆండ్రా, ఇది ఫ్రిక్‌కు ఎంతో మంచి విషయం" అని ఆమె వెంటనే సంతోషించింది. "ఇందువల్ల మన కేమివస్తుంది?" అన్నది.