పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొద్దికాలానికే జనవరి, 1, 1882 న పదవ వంతు కార్నెగీ వర్గంవారి యాజమాన్యం గల స్టాకుతో హెచ్. సి. ఫ్రిక్‌ కోక్ కంపెనీ స్థాపితమైంది. ఈ సంస్థలో ఇలా ప్రారంభమైన కార్నెగీల యజమాన్యం కాలక్రమేణ, ఫ్రిక్కే కంపెనీ విధానాన్నంతటీనీ నిర్ణయించేవా డయినప్పటికీ, కాలక్రమేణ అది వారికి అత్యధిక ప్రతిపత్తి నిచ్చేటంతవరకూ పెరిగింది. ఈ మధ్య కాలంలో ఫ్రిక్ కార్నెగీ స్టీల్ కంపెనీలోని తన పెట్టుబడులను పెంచుకొన్నా.

లండన్‌కు వచ్చి బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ ముందు అతని రచనను చదవవలసిందిగా ఆహ్వానింపబడేటంతటి ఖ్యాతి నార్జించుకున్న కెప్టెన్ బిల్‌జోన్స్ ఈనాడు ఉక్కులోకంలో సుప్రసిద్ధు డయినాడు. అతడిప్పుడు హోమ్ స్టెవుడ్ లోని వ్యవహారాలను చూస్తున్నాడు. తనకు ప్రియమయిన మార్గాన్ని అనుసరించి జోన్స్‌కోసం కొంత స్టాక్ ను వేరుచేసి అతడు రెండేండ్ల ధనంతో దాని విలువను చెల్లించుకొనే పద్ధతిమీద అతణ్ని భాగస్వామిని చేద్దామనుకొన్నాడు. ఇందుకు అలా జరిగితే తాను కంపెనీతో ఒకడైపోవటంచేత తనకు కార్మికులకు మధ్య వుండే సంబంధం చెడిపోతుందని జోన్స్ అభ్యంతరం చెప్పాడు.

అతడు "వారు నేను ఏవో పోకిళ్లు పోతున్నా" నను కొంటా రన్నాడు.

"అయితే ఇందుకు నీ సూచనఏమిటన్నాడు ? కార్నెగీ.