పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పడ్డ తబ్బిబ్బులోనుంచి తట్టుకొని ఊపిరి సలుపుకోవటానికి వాళ్ళకి కొన్ని క్షణాలు పట్టింది. వారు తమకు డబ్బే కావాలని గట్టిగా కోరారు. తిరిగి ఆలోచించుకోటానికి క్షణ కాలమైనా ఇమ్మని అడగ లేదు. వారిలో ఒక్కడికి తప్ప తక్కిన వారందరికీ వేరే ఉక్కు వ్యాపారాలున్నాయి. ఆ ఒక్కడు మిస్టర్ సింగర్. ఇతడుమాత్రం ఆలోచించుకోటానికి ఇరవైనాలుగు గంటల కాలవ్యవధి నిమ్మనికోరాడు. అతడు మర్నాటి ఉదయం తిరిగివచ్చి "నిన్న నీ వన్నది నిజంగా చెల్లించే మాటేనా?" నీవు నన్ను భాగస్థునిగా తీసుకొంటావా?

"తప్పక తీసుకుంటాను." నవ్వుతూ సమాధానమిచ్చి "ఏది, కరచాలనం చెయ్యి భాగస్వామీ!? అన్నాడు.

తరువాత ఆతని పూర్వభాగస్థులు తమకు దూరదృష్టి లేకపోయినందుకు ఎంతో చింతించారు. అయితే మిష్టర్ సింగర్ మాత్రం తాను తీసుకొన్న నిర్ణయానికి ఎన్నడూ చింతపడ లేదు. ఉక్కు అప్పుడప్పుడె తన స్థితికి తాను వస్తున్నది. రైలుపెట్టెలు, కార్లు, వంతెనలు, యంత్రసామాగ్రులు, బాయిలర్లు, పైపు, కేబిల్, బార్బుడువైరు, అన్నిటికీ మకుటాయమానంగా కొత్తగావచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్న స్కైస్క్రేపర్లకు చట్ట నిర్మాణం పూర్వపు పట్టాలకు తోడయినది. వీటన్నిటికీ ఉక్కు కావాలి.

1881 లో విశేష ప్రాముఖ్యాన్ని పొంది అందరి దృష్టినీ ఆకర్షించినవాడు పశ్చిమ పెన్సిల్వేనియా నుంచి