పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నీకు శుభ మగుగాక! నాకు అటువంటి లాంచ నాడంబరా లేవీ లేవు" అని ఆ నిత్య ప్రజాస్వామిక వాది వెల్లడించాడు. "నీకు ఏదో విధమైన డిజైను కావాలంటే ద్వారం మీద ఉదయకాల రవి తన కిరణాలను అన్ని దిక్కులకూ ప్రసరిస్తున్నట్లు చిత్రించి దానిక్రింద తేజస్సుప్రాప్తించు గాక!" అన్న వాక్యాన్ని ఎందుకు వ్రాయకూడదు" అని సూచన చేశాడు. చివరకు అలా చేయటమే జరిగింది.

దక్షిణాన్నుంచి ఉత్తరానికి, ఇంగ్లండునుంచి స్కాట్లండుకు, ఆ గ్రంథాలయ భవనానికి కొణశిలను స్థాపించేటందుకు డన్ఫ్‌ర్మ్‌లైన్ చేరుకొనేటట్లు కార్నెగీ ఒక క్రోచ్ ప్రయాణాన్ని ఏర్పాటు చేయించాడు. ఉల్లాస కరమైన ఆ ప్రయాణబృందంలో తాను తల్లితోసహా పదహారుమంది సభ్యు లున్నారు. మిగిలిన వారంతా తాత్కాలికంగా తమపని కట్టిపెట్టి ఆఫీసు బల్లమీదినుంచి లేచి రావటానికి అవకాశం కలిగిన అతని సహచరులు, మిత్రులు. ఇందులో కొందరు భార్యలతోకూడ వస్తున్నారు. ఆ నాలుగు గుర్రాల కోఛ్‌లో డ్రయివరు ప్రక్కన ఎత్తుగా కూర్చున్న డెబ్బది యేండ్ల మార్కెరేటె కార్నెగీ బృంద మంతటిలోనూ ఎక్కువ వుల్లాసంగా కనిపించి వుంటుంది. అనేక పర్యాయాలు ఆమె సెలయేళ్లు దాటవలసి వచ్చినప్పుడు నీళ్ళలోకాళ్ళీడ్చుకుంటూ నడిచింది. ఒకమాటు ఆమె తన షర్టును పైకిమడచి పచ్చగడ్డిమైదానంమీద కొండరువ్వులు (Highland Flings) నటించి చూపించింది. స్కాట్లండుకు ఇదే తన చివరిప్రయాణ