పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తంతో పరిణమించివున్న లూసీఫర్నేసెస్ అన్న సంస్థలు విలీనం చెయ్యబడ్డాయి. కార్నెగీ స్టీలు గ్రామసీమలలో వేలకొద్ది మైళ్లు రైలురోడ్లను నిర్మించటానికి, బ్రిడ్జిలను నిర్మించటానికి, అప్పటి కాలంలో యుగాద్భుతంగా భావింపబడ్డ న్యూయార్క్‌లోని ఈస్టునది మీది పెద్దస్వానును నిర్మించటానికి తోడ్పడింది.

ఈ సంవత్సరమే తన తొలిదానంగా ఉచితజ్ఞుడై అతడు ఒక ప్రజాగ్రంథాలయాన్ని డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు ఇవ్వటం జరిగింది. ప్రపంచంలో మరే నగరమయినా సరే తన కాదానాన్ని ఇచ్చినందుకు అతణ్ని ఆ నగరం ప్రశంసించినట్లు ప్రశంసించి ఉండేది కాదు.

అతడు వాస్తు శిల్పి (Architect) తో ఆ భవన పధకాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు అతడు "మిష్టర్ కార్నెగీ మీకు శలాచనం (కోట్-ఆప్ ఆమ్) చిత్రమొకటి నాకు కావలె అది ఈ భవనంలో ఎక్కడో ఒకచోట అది వుండాలి." అన్నాడు. ధనసంపాదనం చేసిన అమెరికన్లు తమకు పారంపర్యంగా వచ్చిన ఆ ప్రాచీన కాలపు 'లాంఛనాలు' లేకపోతే వాటిని తయారుచేయటంలో ప్రత్యేక నైపుణ్యమున్న వాళ్ళను పిలిపించుకొని కొత్తగా కల్పితమైన వాటిని చేయించుకుంటుండే వారు. కార్నెగీకూడా ఈ విధానాన్నే అనుసరించి, అటువంటి లాంచనమేదో చేయించుకొని ఉంటాడని ఆ గృహ నిర్మాత భావించి వుంటాడు. అయితే అలా జరుగ లేదు.