పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మని తెలుసుకోవటంవల్ల ఆమె అందరికంటె ఇందువల్ల అధిక ప్రయోజనాన్ని పొంద దలచింది.

అంకుల్ లాడర్ ఈ బృందాన్ని ఫిర్త్ ఆఫ్ పోర్తు దగ్గరకు వచ్చి కలుసుకున్నాడు. గ్రామసీమయావత్తు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు మూగుతున్న దని వీళ్లు తెలుసుకున్నారు. ఈ బృందం పాత నగరాన్ని చేరేటప్పటికి గుంపులు బాగా పెరిగిపోతున్నవి. స్కాట్లండ్, ఇంగ్లండ్, యునైటెడ్ స్టేట్ల పతాకాలు ప్రాత రాజభవనం మీద ప్రక్క ప్రక్కగా ఎగురుతుండటం వీరి కంటబడ్డది. పెద్ద అందమైన తోరణం ఒకటి ఊరు బయట ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ప్రోరోష్ట్, నగర కౌన్సిలు సభ్యులు, న్యాయాధికారులు వారి వారి ఔద్యోగికమైన దుస్తులతో ఈ బృందం వారి రాకకోసం ఎదురుచూస్తున్నారు. స్వాగతం చెబుతూ ప్రసంగాలు చేశారు. ప్రధాన స్వాగతప్రసంగం చేసింది ఒక వుద్యోగి కాదు ఔహిత్య శోభితంగా ఈ పనిని ఒక నేత పనివాడు నిర్వర్తించటం జరిగింది. ఇం దత డెంతో సమర్ధతను ప్రదర్శించాడు. బ్యాండు వాయించేవారు, బాగ్ పైపర్లు, లాడ్జీలు, కార్మికులసంఘాలు - వీళ్ళలో చాలామంది లినెన్ మిల్లులో పనిచేసే స్త్రీలు, బాలికలు ఉన్నారు - వీళ్ళందరితో గూడిన వుత్సవం మైలు పొడుగున నడిచింది. ఇందులో పాల్గొన్నవారు బ్రిటిష్, అమెరికన్ జెండాలను, బానర్లను పట్టుకొని "కార్నెగీకి స్వాగతము" అని వ్రాసిన ఆర్చిల క్రిందుగా ఊరేగింపును నడిపించారు. ఈ వుత్సవం ఆండ్రూ జన్మించిన శిలాకుటి (Stone Cottage) దగ్గిర, అతని తల్లి పెట్టిన స్వీట్ షాపు [ మిఠాయిదుణాం ]