పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మరువరాని సంవత్సరం

9


1881 సంవత్సరమంతా ఆండ్రూ కార్నెగీ జీవితంలో ప్రత్యేకంగా గమనింపదగ్గ సన్ని వేశాలతో నిండినది. ఐదు మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఆ సంవత్స రారంభంలో కార్నెగీ బ్రదర్స్ అన్న మహాసంస్థను స్థాపించటంతో ఆండ్రూ బాల్యంలో తమ్ముడి కిచ్చిన వాగ్దానాన్ని చెల్లించాడు. ఈ సంస్థలో కార్నెగీ పెట్టుబడి సగానికి కొంచెం ఎక్కువ. ఇది సామాన్యమైన సంస్థల వంటిది కాదు. దీని యజమానులు షేరు హోల్డర్లు కాదు. సహ వ్యాపారస్థులు. ఆండ్రూ కార్నెగీ ఎవడయినా పైకివచ్చే లక్షణం గల యువకుణ్ణి చేర్చుకోటానికి నిర్ణయించిన సందర్భాలలలో తప్ప సామాన్యంగా ఈ బృందంలోవారు స్టాకును తమలో తమకు కాక ఇతరుల కెవ్వరికి అమ్మ రాదు. అంటే ఈ సంస్థ స్టాకు ఆండ్రూ కార్నెగీ విశేషంగా అసహ్యించుకొనే స్టాక్ ఎక్స్‌ఛేంజిలోకి ఎన్నడు వెళ్ళదన్నమాట. ఈ నూతన మహాసంస్థలో ఎడ్గర్ థామ్సన్ స్టీల్ వర్క్స్, ది యూనియన్ ఐరన్ వర్క్స్, ఎన్నో కోల్‌మైన్లు, కోల్ ఒవెన్లుగా ప్రస్తు