పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జాతివాడు. అంతర్యుద్ధ 'కురు వృద్ధ' ఎడ్గర్ థామ్సన్ కంపెనీతో స్పర్థవహించి పనిచేసే మరొక సంస్థనుంచి ఇతడు యజమానులు తన సామర్థ్యాన్ని గుర్తించక పోవటంవల్ల విసుగుజెంది బయటికి వచ్చేశాడు. ఇటువంటి వ్యక్తిని కార్నెగీ తన ఉద్యోగిగా సంపాదించటంతో కంపెనీ విజయం మరింత నిశ్చితమయింది.

కార్నెగీ విజయ రహస్యాలల్లో మరొకటి వ్యక్తులను గురించి అతనికి ఉన్న అపూర్వ వివేచనాశక్తి. ప్రసిద్ధిగన్న ఒక ఉత్పత్తిదారు అతణ్ని గురించి "ఒక స్థానంనుంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని అతనివలన అత్యుత్తమ ప్రయోజనం కలిగే మరొక స్థానంలో అతణ్ని నిలిపే కౌశలం విషయంలో ఇతడు నే నెరిగిన వాళ్ళందరిలోను మేటి" అన్నాడు. "ఇతరులు యోగ్యతను కొద్దిగా గుర్తించటమో లేక అసలే గుర్తింపక పోవటమో జరిగిన వ్యక్తిని కార్నెగీ ఒక ప్రముఖ స్థానంలో నిలపటం నాకు తెలుసు. అతడు నిల్పిన వ్యక్తి ఆ స్థానంలో ఏల్ తాళపు డిప్పల్లాగా ఒదిగిపోయ్యాడు. వ్యక్తులను ఎన్నుకోటంలో కార్నెగీకి సాటి ఐనవాడు ఉన్నాడని నేను అనుకోను" అని అత డన్నాడు.

"నూతన యంత్ర సష్టనుగా గాని, రాసాయనిక వేత్తనుగా గాని, పరిశోధకు డనుగా గాని, యంత్ర నిర్మాతనుగా గాని నా కొక స్థానమున్నదని అనటానికి నాకు అణుమాత్రమయినా యోగ్యత వేదు." అని కార్నెగీ విస్పష్టంగా చెప్పనే చెప్పాడు. ఆతడికి తెలిసింది యోగ్యులైన వ్యక్తులను గుర్తించటం, వారివల్ల అత్యుత్తమ సేవలను పొందటం