పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత్రమే. "పొందవలసిన సేవ కేవలం బుద్ధిసంబంధమైనదీ హస్తసంబంధమైనదీ మాత్రమే కాదు" అన్నా డతడు. గణనకు వచ్చేది హృదయసంబంధి ఐన సేవ. అతనిబుద్ధి అతిశయమైన కుశలతతో పనిచేయటానికి ముందే నీవు నీ ఉద్యోగిలోని వ్యక్తిగత నైజస్వభావాన్ని, హృదయాన్ని ఆకర్షించి అధీనం చేసుకోవాలి" అన్నది కార్నెగీ అభిప్రాయం.

ఇప్పటికే కార్నెగీ తన జ్ఞాతియైన డాడ్ హృదయపూర్వక సహకారాన్ని సంపాదించాడు. అతడు డాడ్ ను 1870 లో సంస్థలోకి తీసుకువచ్చాడు.

డాడ్ ఈనాడు సంస్థతో అవినాభావ సంబంధం గల వ్యక్తి. ఇతరమైన ఇనుప కంపెనీలు, బ్రిడ్జి కంపెనీలు లాగానే కార్నెగీ ఉక్కు సంస్థకూడా తన ఉపయోగంకోసం బొగ్గు గనులను సంపాదించింది. తన కంపెనీ బొగ్గుగనుల్లో వృథాగాపోతున్న పదార్థాన్నిగురించి, చిట్లెమును గురించి కోల్మన్ బహుకాలం ఆందోళన చెందాడు. ఒక సందర్భంలో ఆతడు ఇంగ్లండులో ఉన్నప్పుడు జార్జి లాడర్ అనే వ్యక్తి అతనికి పై విధం వ్యర్ధమయ్యే పదార్థాన్ని అంతటినీ పరిశుంభ్రంచేసి బొగ్గుకు బదులుగా వాడటం చెయ్యటంకోసం తాను కనిపెట్టిన ఒక విధానాన్ని చూపించాడు. దాన్ని చూసి క్లోమన్ మహోత్సాహంతో ఇంటికి వచ్చాడు. "డాడ్! వెంటనే ఇక్కడికి వచ్చి నీ విధానాన్ని మాకు చూపించాలి" అని కార్నెగీ అతడికి వ్రాశాడు. అతడు వచ్చి అమెరికాలో చిట్లెపు బొగ్గును పరిశుద్ధిచేసే మొట్ట మొదటి కర్మాగారాన్ని నిర్మించాడు. ఇందువల్ల కంపెనీలకు ఎన్నో నిలవలు చేకూ