పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యథాక్రమంగా అలవాటుపడ్డది. ఆరీతిమీద పెద్ద ప్రీతిని ప్రదర్శింపక పోయినా తృప్తితో వుండటానికి నిశ్చయించుకుంది. విశ్రాంతి కోసం ఆమె మొదటి రాత్రి ఘనంగా అమర్చిన శయ్యమీద వెన్ను వాలుస్తున్నప్పుడు ఇరవై సంవత్సరాలకు పూర్వం ఒక పేద నేతపనివాడు భార్యను, తన ఇద్దరు చిన్న కుర్రవాళ్ళను తీసుకొని అప్పు చేసిన డబ్బుతో అమెరికాకు వలసవచ్చి చుట్టూవున్న అద్భుతాలను వెర్రిగా చూస్తూ న్యూయార్క్ నగరవీధుల్లో వున్నదృశ్యం ఆమెకు తప్పక జ్ఞప్తికి వచ్చి ఉంటుంది.

ఆండ్రూ కార్నెగీ వ్యాపారం తన దగ్గిరకు వస్తుందని తన న్యూయార్క్ కార్యాలయంలో కూర్చో లేదు. వెంటనే అతడు అక్కడి మిసిసిపీ నదిమీద వంతెనలను నిర్మించేటందుకు కాంట్రాక్టులను సంపాదించటం కోసం కెయెకుక్, అయోహలకు పరుగెత్తాడు. కీస్టోన్ బ్రిడ్జిలను నిర్మించటంలో పోత ఇనుముకు బదులుగా దుక్క-ఇనుమును వాడుతున్నందున వాదన చేసి డుబుక్యూ అనే ప్రదేశంలో ఆ మహానది మీదనే జరుగుతున్న నిర్మాణానికి ఒక బ్రిడ్జిని అమ్మటం కోసం తరువాత సంవత్సరంలో అతడు మరొక మారు మిడ్వెష్టుకు వెళ్లాడు.

1868 ముగీయుబోతున్నప్పుడు తన రాబడిన కూడుకోటం కోసం కూర్చు సమయంలో అది 56,110 డాలర్లు అయినట్లు అతడు గమనించాడు. కుర్చీలో వెనక్కు వాలి, కలాన్ని త్రిప్పుతూ, దృష్టిని కొద్దిక్షణాలు గోడమీద నిలిపి