పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"అయితే, ఆమె కూడా నీతోబాటు వస్తుందన్న మాట" అన్నాడు టామ్.

"ఔను" అన్నది వాళ్ళ తల్లి. "ఇటువంటిది రానున్నదని నేను ఊహిస్తూనే ఉన్నానుగాని రాత్రే ఆండీ ఈవార్త నాకు చెప్పాడు" హోమ్‌వుడ్ ను విడిచిపెట్టి వెళ్ళటం నా కిష్టంలేదు. కానీ అతని క్షేమానికి వుపకరిస్తే విడిచిపెట్టి వెళ్ళటం నా కిష్టమే."

"నీవు, టామ్, హారీ ఫిప్స్‌ల వంటి భాగస్థులు-మిస్టర్ కొల్‌మన్, పైప్, క్లొమన్‌లను గురించి చెప్పవలసిన పని లేదు. వుండటంచేత ఇక్కడ ఇక నాతో అవసరం లేదు. అయినా ఇక్కడి విషయాలు యెలా నడుస్తుంటవో నేను కనిపెట్టే వుంటాను" అని అతడు సంభాషణను కొనసాగించాడు. ఇరవయ్యోపడిలోనే ఉన్నా ఆత్మశక్తితో సమర్థతతో కర్మాగారాలను నడిపించే నేర్పుగలిగి వ్యాపార మేధావి అని నిరూపించుకున్నప్పటికీ టామ్ ఆ విషయాన్ని నవ్వివేశాడు.

లూసీకి టామ్‌కు వివాహమయింది. అది చాలా సంతోష ప్రదమయిన వివాహంగా పరిణమించింది. వాళ్ళు హోమ్‌వుడ్ గృహాన్ని తీసుకొన్నారు. ఆండ్రూ, అతని తల్లి న్యూయార్కుకు వెళ్లారు.

న్యూయార్క్ మహానగరంలో కల్లా పెద్దది అందమైనది అయిన సెయింట్ నికొలాస్ హోటలులో ఒక వరుస తీసుకొన్నారు. మార్గ రేట్ కార్నెగీ నూతన జీవితరీతికి