పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చేసుకోవలసి వుంది. "నీవు ఎక్కడ నివసించదలచుకున్నావో నిశ్చయించుకొన్నావా" అని యాత్రనుంచి తిరిగి వచ్చిన తరువాత అతడు తమ్ముణ్ని ప్రశ్నించాడు.

"లేదు" అన్నాడు టామ్

"ఈ ఇంటిని నీవు పుచ్చుకోటంలో నీ అభిప్రాయమేమిటి!"

అప్పుడు వాళ్ళు హోమ్‌వుడ్ లోని ఇంట్లో ఉదయ భోజనం చేస్తూ భోజనశాలలో వున్నారు.

"ఈ అభిప్రాయం లూసీకి నచ్చితే ఈ ఇల్లు నాకెంతో బాగుంటుంది" అన్నాడు టామ్. "కానీ నీవు ఎక్కడికి వెళ్లుతావు? న్యూయార్క్‌కు వెళ్లుదామన్న ఉద్దేశం ఇంకా నీలో ఊగిసలాడుతున్నదా?"

"ఔను అది చేయదగ్గ పని కడచిన కొన్ని సంవత్సరాలల్లో ఎన్నో పర్యాయాలు నేను అక్కడికి వెళ్ళిరావటం నీవు గమనించావు గదా ? గ్రేట్ బ్రిటన్‌కు లండన్ ఎలా కేంద్రమో యునైటెడ్ స్టేట్సుకు న్యూయార్క్ అలా సమస్తానికీ కేంద్రం కాబోతున్నది. అక్కడి బ్యాంకర్లు ముఖ్యంగా ఆంగ్లేయ కంపెనీలతో సెక్యూరిటీల విషయంలో దౌత్యాలు నడపమని తరుచుగా నన్ను అడుగుతున్నారు. అందుమూలంగా నాకు మంచి కమీషన్లు వస్తాయి. అమ్మా నేను ఇక్కడికి తరుచుగా వస్తూ పోతూ వుంటాము.