పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కార్నెగీ ఆ డబ్బు నిచ్చాడు. అందువల్ల అతడు ఆ సంస్థలో భాగస్తుడైనాడు. అతి శీఘ్రకోపి, అనుమానగ్రస్తుడు అయిన క్లోమన్ కలతలుపెట్టె ధోరణిలోనే ఉంటూవచ్చాడు. ఎవరో తన్ను మోసగించటానికి యత్నిస్తున్నారన్న భయంతో దీనికి తరువాత కొద్దికాలంలోనే అతడు అందరీకి చెందే ఒక తగాదాను పట్టుకొచ్చాడు. థామస్ యన్ మిల్లర్ తన ఇనుముసంస్థలో భాగస్థుడు కాడని పత్రికల్లో ఒక ప్రకటనచేశాడు. దాంతో విసుగువచ్చి మిల్లర్ ఆ కంపెనీలోని తనషేర్లను అమ్మేశాడు.

"టామ్, మనం స్వంతంగానే ఒక రోలింగ్ మిల్లును ఆరంభిద్దా" మన్నాడు ఆండ్రూ కార్నెగీ. "అది మన బ్రిడ్జి కంపెనీకి, ఇతర సంస్థలకు కావలసిన ఇనపసామాన్లను తయారుచేస్తుంది."

"అయితే మనం మీ తమ్ముడు టామ్ కంపెనీతో పోటీ చేయటమౌతుందేమో" అని అభ్యంతరం చెప్పాడు. మిల్లర్ ఇరువురికి చాలినంత వ్యాపారముంది. వాళ్ళిప్పుడు యుద్ధపు కాంట్రాక్టుల పని చూస్తున్నారు. మనం విశేషంగా బ్రిడ్జీలకోసం కృషి చేద్దాం.

అందువల్ల 1864 లో సైక్లోప్స్ ఐరన్ వర్క్స్ ఆరంభింపబడ్డది. క్లోమనుకు నిజంగా తీవ్రకోపంవచ్చింది. అయితే ఆ కోపాన్ని దిగమ్రింగుకోవలసివచ్చింది. యుద్ధం చివరదశకు వచ్చింది. సైన్యానికి సంబంధించిన ఆర్డర్లు సన్నగిల్లిపోవటమే కాకుండా చిన్నవై పోతున్నవి. కొద్దికాలం గడిచాక