పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతని భాగస్థులు తమ కంపెనీ సైక్లోప్స్‌తో అంతర్లీనం చేద్దామని సూచించారు. మార్పులు, అభివృద్ధులు తల కెక్కేటంత వేగంగా వచ్చేస్తున్నవి. అందుచేత తన కిష్ట మున్నా లేకపోయినా యూనియన్ ఐరన్ వర్క్స్ అన్న క్రొత్త కంపెనీ డైరక్టర్ల బల్లముందు టామ్ మిల్లర్ ఆండ్రు కార్నెగీలతో పాటు అతడు కూర్చోవలసి వచ్చింది.

"టామ్, నీవు చింతించేటంతగా నీకు అపచారం జరిగింది. అయితే ఇప్పుడు నీవే విజేతవైనావు" అన్నాడు ఆండ్రు కార్నెగీ.

కర్మాగారాలను రెంటిని కలిపివేయ లేదు. రెండు విడివిడిగా కూత పెట్టి అతివేగంగా పనిచేస్తున్నవి.

యుద్ధపు చివరదశలో అతని రైల్‌రోడ్ వుద్యోగం పై అధికారులయిన థామ్సన్, స్కాట్‌ల అభిలాషకు భిన్నంగా అంత మొందింది. ఆండ్రూ మార్చి 28, 1865 లో రాజీనామా లేఖను అందజేశాడు. ఎవరి మధ్య పనిచేసి తానెవరి అనురాగాన్ని అనుభవించాడో ఆ పిట్స్‌బర్గు డివిషనులోని వ్యక్తులను ప్రసంసిస్తూ ఒక వీడ్కోలు లేఖ వ్రాశాడు. వారు వీడ్కోలువేళ అనురాగపూర్వకంగా ఒక అందమైన గడియారాన్ని బహుకరించారు. మరొక అలిఘనీ పూర్వ బాలురలలో వాడు బాబ్ పిల్కైరన్ అతని తరువాత ఆ స్థానానికి అధిపతిగా వచ్చాడు. ఏవో డజను ఇతర మైనపనులు తాము అలవోకగా చేసినట్లే కార్నెగీ మిల్లర్లు ఇద్దరూ కొద్ది