పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొద్ది దఫాలువారీగా చెల్లించవలెనని చార్టరులోవుంది. కంపెనీ కొత్త యంత్రాలకోసం కొంతఖర్చు పెట్టవలసివుంది. నా దగ్గిర డబ్బు విశేషంగా లేదు. కొద్ది వందలతో నిన్ను అందులో ప్రవేశపెట్టిస్తాను."

హారీ కృతజ్ఞతపూర్వకంగా ఈ మేలుకు అంగీకరించాడు వృద్ధిపొందుతూ. నిశ్చయంగా లాభాలొచ్చే వ్యాపారంలో తనకోసం పెట్టుబడి పెట్టుకోడానికి వినియోగించుకో కుండా దయాళువయిన టామ్ తన దగ్గరవున్న పదహారు వందల డాలర్లలో ఫిప్స్‌కు ఎనిమిదివందల డాలర్లు, విలియం అలెగ్జాండర్లకు ఎనిమిదివందల డాలర్లు అప్పిచ్చాడు. విలియం అలెగ్జాండరు ఇద్దరూ ఒకనాటి "బాటమ్ హూషియర్లు" బాల్యంనుంచి అంత సన్నిహితమయిన అనుబంధం వుండి ఒకరియెడ మరొకరికి అంత శ్రద్థాశక్తులుగల యువక వర్గాన్ని మరొకచోట చూడటం చాలాకష్టం.

గణకుడుగా వుండే యువ ఫిప్స్‌క్లోమన్ అండ్ కంపెనీలో ప్రవేశించాడు. పౌడర్ కంపెనీలో పగలంతా పనిచేసిన తరువాత కొద్దిగా భోజనంచేసి క్లోమను కార్యాలయానికి పరిగెత్తి సాయంత్రం ప్రొద్దుపోయేదాకా పుస్తకాలలో గడిపే వాడు. అతడు ఆ ఆఫీసుకు వెళ్ళేటప్పుడు, అతనితో సమవయస్కు డయిన టామ్ కార్నెగీ అతనివెంట నిత్యం తప్పనిసరిగా వెడుతుండెవారు. వారు డేవిడ్ జోనాధన్‌లలా అన్యోన్యం అతి సన్నిహితులు. కొన్ని నెల లయిన తరువాత క్లోమను కంపెనీకి మరికొంత డబ్బు కావలసివస్తే తమ్ముడిపేరుతో ఆండ్రూ