పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితమంతా భగ్నమయిన ఒక వృద్ధిడిలా ఆవరించిన నిరాశతో.

టామ్ మిల్లర్ మళ్ళీ ఒకమాటు పరికించాడు. హెన్రీని అతడు బాల్యంనుంచి చూస్తూనే వున్నాడు. మంచి తేజస్సు, ప్రతిభ, న్యాయ తత్పరతగల యువకుడుగా తోచాడతనికి. పైగా అతడు తనకు బహుకాల ప్రియమిత్రుడయిన జాస్‌కు సోదరుడు.

"పెట్టుబడికి నీదగ్గిర డబ్బేమయినా వుందా?" అని అడి గాడతడు.

"లేదు" అన్నాడు హెన్రీ. "అప్పుడప్పుడు కొద్దికొద్దిగా జీతంలోనుంచి మిగుల్చుకొన్నాను. కానీ ఆమొత్తాన్నీ నా కుద్యోగమిచ్చిన వాడి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను."

క్లొమన్ అండ్ కంపెనీలో ప్రవేశించటం నీ కిష్టమేనా?

"నా చేతిలో విడిగా డబ్బున్నట్లయితే తప్పక ప్రవేశిస్తాను. కానీ లేదని నిరాశతో చేయిచాచాడు."

"నేను నీకు కొద్దిగా అప్పిస్తాను" అన్నాడు. మిల్లర్. ఆ వ్యాపారం స్థితి ప్రస్తుత మిలావుంది. ఎనిమిది వేల డాలర్ల మూలధనంతో మా సంస్థ స్థాపితమైంది. అయితే దాన్ని అంతా చెల్లించ లేదు. వ్యాపారపు టవసరాలు పెరుగుతున్న