పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్డర్లు ఊరికే వచ్చిపడుతున్నవి. ఒకరోజున ఫీప్స్-జాన్‌కు చిన్నతమ్ముడు. ఇతడు తరువాత కొద్దిసంవత్సరాలకు చనిపోయాడు-మిల్లర్ ఆశపడుతూ "నాకు ఇనుము వ్యాపారంలో ప్రవేశించాలని వుంది. అయితే యెలా సాధ్యమౌతుందో బోధపడటం లేదు" అన్నాడు.

టామ్ సొగసుగా మీసాలనుగుంజుకుంటూ కొద్దిసేపు ఆలోచించాడు. అతనికి హెన్రీ, ఇంకా బాగా వయసు చేకూరనివాడు. ఒకరోజు "నాకు ఒక క్వార్టరు బదులు ఇస్తావా" అని అన్ననడిగి తెచ్చుకొని స్వంతవ్యాపారాన్ని ఎలా ప్రారంభించుకొన్నాడో స్మృతికి వచ్చింది. అన్న ప్రశ్నార్ధకంగా తనను చూచినప్పుడు హెన్రీ "ఇది అత్యవసరమయినది" అన్నాడు.

జాస్ ఆ క్వార్టరును సందేహించకుండా ఇచ్చాడు.

మర్నాడు 'డిస్పాచ్‌' పత్రికలో 'కావలెను' అన్న ప్రకటన కనిపించింది. "ఉత్సహవంతుడయిన కుర్రవాడు ఏదైనా పనికోరుతున్నారు." ఏమాత్రం దాపరికం లేని ఈ చిన్న ప్రకటనకు ఒక వ్యాపారసంస్థ సమాధానమిచ్చింది.

అది అతనికి 'ఎర్రండ్ బాయ్‌'గా వుద్యోగమిచ్చింది. తలిదండ్రుల ఒప్పుదలతో అతడు బడి విడిచిపెట్టి ఆ పనిలో చేరాడు. ఆనాటినుంచి అతడు ఒక్కరోజునుకూడా వృధాగా పోనివ్వ లేదు. ప్రస్తుతం అతడు ఒక పౌడరు కంపెనీకి బుక్కీపరుగా పనిచేస్తున్నాడు. ఒకమాటు "వయసు ఇరవయి సంవత్సరాలు, నేను ఇంకా ఎందులోనూ ప్రవేశించ లే"దన్నాడు.