పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భంగపడిన తీర్మానం

7

అల్తూనాలో వున్నప్పుడు కార్నెగీ ఒకరైల్ రోడ్ షాపులో తొలిసారిగా ఇనుపబ్రిడ్జీని చూచాడు. అది చిన్న పగుళ్ళ మీదుగా పట్టాలను యివతలనుండి అవతలకి తీసుకోపోవటం కోసం తయారు చేసింది. దీని నమూనాను కంపెనీ వారి ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న హెచ్. జె. అన్విల్ల షాపుల్లోని యాంత్రీక మేధావి జాన్ యల్ పైపర్ సాయంతో నిర్మించాడు. వాళ్లు యిరువురూ కలిసి దానికి పేటెంటు తీసుకొన్నారు. పైపర్ ను షాపుల్లోను, ఆఫీసులోను అందరూ "పైప్" అని వ్యవహరిస్తుంటారు' ఇతడు రైల్ రోడ్ కంపెనీవారికీ వంతెనలను నిర్మించి యిస్తుంటాడు. ఇంత వరకూ ఇతడు తనపని తనంతటినీ కొయ్యతోనే చేస్తుండేవాడు. బ్రిడ్జీలు ఆ దినాలలో కొయ్యది కావటంవల్ల తరచు కాలిపోతుండేవి. వాటికీ, కొట్టుకొని పోతున్న వాటికీ బదులుగా అతి వేగంగా బ్రిడ్జీలను తయారుచేసి యివ్వడంలో యెంతో పేరెక్కినవాడు, "ఒక యింజనీరింగ్ దళాన్నంత