పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


టినీ వేసేదానికంటె కాలిపోయిన భ్రిడ్జీదగ్గరకు నేను 'పైపు'ను పంపుతాను "అని అధ్యక్షుడు థామ్స్‌న్" ఇతడ్ని గురించి అన్నాడు.

ప్రస్తుతం 'పైప్‌' ఇనుప బ్రిడ్జిలు కావాలని పరవశుడై వాదిస్తుంటాడు, "ఆండీ; కొయ్యవంతెనల కాలంఅయిపోయిం"దని ఇతడు పదేపదే అంటుండేవాడు. "ఇకనుంచి ఇనుపది తప్ప మరేవి ఉండవు. రాబొయ్యే ఇరవై సంవత్సరాలల్లో మొదటి తరగతి రైల్ రోడ్డుమీద కొయ్య వంతెన అంటూ వుండదు. కాలిపోనివి ఏటి పొంగులకు కొట్టుకొని పోనివీ అయిన యినుప బ్రిడ్జీలను గురించి యోచించు."

అతడు, రైల్‌రోడ్ కంపెనీ వారి బ్రిడ్జీల జనరల్ సూపర్వైజరు ఆరన్ స్ఖిప్లర్ ఇద్దరూ 1862 లో కంపెనీ వుద్యోగాన్ని వదిలేసి తా మిరువురూ భాగస్వాములుగా వంతెనలను నిర్మించే ఒక కంపెనీని ప్రారంభించారు. అయితే వారికి వ్యాపారంలోని కిటుకులు తెలిసిన వాళ్ళు పెట్టుబడి పెట్టగలవాళ్ళు కావాలి. లిన్విల్లి కార్నెగీలను కంపెనీలోకి తీసుకొన్నారు. వీరిలో కార్నెగీ అయిదుగురు భాగస్వాములతో కీస్టొన్ బ్రిడ్జి కంపెనీని స్థాపించాడు. అయిదవ వాడు థామస్ యన్. స్కాట్. వీరు ప్రతివొక్కరు పన్నెండువందలయాబై డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఆరువేల ఆరువందల యాబై డాలర్ల పెట్టుబడితో వొక బ్రిడ్జీలను నిర్మించే కంపెనీని ఆరంభం చెయ్యటం ఈనాటి పారిశ్రామికుల బుద్ధికి పరిహాసాస్పదంగా కనిపించవచ్చు. అయితే అన్నిటి ఖరీదులు