పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాడు. బండి లివర్ పూల్ నుంచి ఉత్తరంగా నడుస్తున్నప్పుడు ఛివియట్ కొండలను చుట్టి అది స్కాట్లండులో ప్రవేశించినపుడు ఆండ్రూ, అతని తల్లిపొందిన ఆనందం పరాకాష్టనందుకున్నది. అలలుగా కదలాడే పచ్చనిపూల పరవులతో అక్కడి కొండప్రదేశమంతా కప్పబడివున్న దృశ్యాన్ని చూసి మార్గెరెట్ కార్నెగీ "ఓహ్! అక్కడే తంగెడు చెట్టు! తంగెడు చెట్టు" అన్నది నెమ్మదిగా. పొంగి పొరలే సంతోషభాష్పాలను ఆమె ఆపుకోలేకపోయింది. ఇక ఆమె కుమారుడు "పవిత్రమైన ఆనేలమీదపడి ముద్దెట్టు కుందామని నా కనిపించింది" అన్నాడు తరువాత.

వారిని గౌరవించే విషయంలో మేము మేమని పోటీపడ్డ అసంఖ్యాకులయిన బంధువులు వారికి స్వాగతంచెప్పారు. మిసెస్ కార్నెగీ తన కుటుంబంతో, మారిసస్‌లతో వుండిపోయింది. ఆండ్రీ సూటిగా అంకుల్ జార్గిలాండర్ షాపులో వున్న గదికి వెళ్లాడు. అక్కడ యువకులయిన వారిరువురూ ఒకరియెడ ఒకరు వాళ్ళ బాల్యంలో వర్తించినట్లే 'డాడ్‌' 'నైగ్‌' లగా ప్రవర్తించారు. వారు 'డగ్లాస్‌' అనే 18 వశతాబ్థపు విషాదాంత నాటకంలోని ఒక దృశ్యాన్ని చిన్నతనంలో చూసినట్లే చూశారు. అక్షరం తప్పిపోకుండా దరిదాపుగా అందులోని పంక్తులన్నీ జ్ఞప్తికున్నట్లు వాళ్లు సరి చూచుకున్నారు.

ఆ బంధువుల్లోకల్లా పెద్దదయిన ఆంట్ ఛార్లెటీకి ఆండ్రూ మరీ పసిబిడ్డగా వున్ననాటి విశేషాలు కొన్ని బాగా జ్ఞప్తికున్నాయి. ఆమె "నీవు చాలా ఆశాపరుడైన బిడ్డ"వని