పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతనితో అన్నవి. "నీకు రెండు చెంచాలతో పోయవలసి వచ్చేది. నోటిలోనుంచి ఒకటి తీసేటప్పటికే రెండోదాని కోసం గుక్క పెట్టేవాడివి. ఆండ్రీ అభివృద్ధిని గురించి తెలుసుకోటం విషయంలో ఆమె ఎంతో వెనకపడింది. అతడు రావటం ఎంతో ముఖ్య విషయంగా భావించింది. "నీవు ఏనాటికయినా తిరిగి వచ్చి ఇక్కడ హైస్ట్రీట్‌లో షాపు పెట్ట లేముసుమా" అన్నది. హైస్ట్రీట్‌లో ఆమె అల్లుడికి ఒక గ్రీన్‌గ్రోసర్ షాపువుంది. అతడు ఇతర వీధుల్లోషాపు లున్న వాళ్ళకంటె కొంత అధికుడుగా ఉండేవాడు. ఆమె దృష్టిలో మానవజీవితంలో సాధింపదగ్గ ఘనమైన విషయం ఆ హైస్ట్రీట్ లో షాపు పెట్టటమే.

కార్నెగీ కుటుంబం అమెరికాకు వలసపోవటంకోసం ఇరవై పౌనులు అప్పిచ్చిన మిసెస్ హెన్డర్ సన్ - అయ్‌లీ ఫార్గీ ఇంకా జీవించేవుంది. ఆమె, జానీలకు ఇప్పుడు బాగా లేకపోవటమనే స్థితే లేదు. ఇరవై పౌనులు తగ్గటంవల్లమొదట కొంత తగ్గుదల వచ్చింది. అయితే డన్ఫ్‌ర్మ్‌లైన్ ప్రమాణాలనుబట్టి చూస్తేవా ళ్ళిప్పుడు ఆనందంగా వున్నారు. అప్పు డిచ్చిన అప్పుకుగాను మిసెస్ ఆండర్ సన్‌కు కార్నెగీ ఇరవై పౌనులు 'ఇంట రెస్టు' [వడ్డీ, ప్రీతి అని శ్లేష] అన్నపేరుతో స్వార్థరహితమైన కృత్యానికి గాఢమైన కృతజ్ఞతగా కొన్ని సంవత్సరాలు పంపించటంతో వాళ్ళకు డబ్బు పెరగటం మొదలెట్టింది. ఇప్పు డతడు "నేను ఆ అప్పును ఇప్పుడు తీర్చి వేయటం మంచిదని భావిస్తున్నా" నన్నాడు.