పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధికారవర్గంవారి ఆలోచనారీతినే మార్చివేసింది. యుద్ధం ఒకటో, రెండో, మూడో సంవత్సరాలు సాగుతుందని గుర్తించటం జరిగింది. స్కాట్, కార్నెగీలు బహుకాలం వారి రైల్‌రోడ్ వుద్యోగాలను విడిచిపెట్టి ఉండటానికి వీల్లేదు. అంతేకాక పెన్సిల్వేనియావంటి ప్రముఖమైన రైల్‌రోడ్‌లు యుద్ధాన్ని కొనసాగించటానికి ముఖ్యంగా అవసరాలుగాకూడా ఉన్నవి. స్కాట్, కార్నెగీలు వారి వుద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వం తన రైలు, తంతిపనులను చూడటం కోసం స్థిరంగా వుండిపోగల వుద్యోగులను నియమించుకున్నది.

పిట్స్‌బర్గుకు తిరిగివచ్చి కార్నెగీ తనవుద్యోగపుతంతువులను అందుకొని, ఆనాటి ఆశాపరులయిన గొప్ప వుద్యోగస్థు లందరూ చేస్తున్నట్లుగానే బయట వ్యాపారాలల్లోని పెట్టుబడులమీద దృష్టి నిలపటం కొనసాగిస్తూనే వున్నాడు. తరువాత వచ్చిన చలికాలపు చివరిభాగంలో చాలావారాలు అతడు గట్టి జబ్బు పడ్డాడు. కార్యాలయానికి తిరిగి వచ్చినప్పుడు తన బలహీనతను తెలిసికొని స్వాస్థ్యాన్ని చేకూర్చుకోవటం కోసం సెల వడిగాడు. సెలవు మంజూరు చేయబడ్డది. సెలవు ఎక్కడ గడపటమా అన్న ప్రశ్న అతనికి కలగనే లేదు. మే మాసాంతంలో తాను, తల్లి డన్ఫ్‌ర్మ్‌లైస్ చూడడానికి వస్తున్నామని వ్రాశాడు.

జూన్ 23 న వారు లివర్ పూల్‌కు ఓడప్రయాణం చేసేటప్పుడు ఎడబాటు ఎరుగని టామ్ మిల్లర్ వారి వెంటవున్నాడు. అతడు బ్రిటన్ అంతా తిరగటంకోసం బయలు దే