పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సైనికుల గుంపు స్టేషన్ మీద వెల్లువగా వచ్చి పడింది. ఒక ఘనవిజయానికి బదులుగా దారుణ విపత్తు రానున్నదని వెంటనే స్పష్టమయింది. బండి తరువాత బండిగా గాయపడ్డవాళ్ళను పంపించటం కొనసాగుతూనేవుంది. వాగన్ మార్లాలు తిరిగివచ్చే సైనికుల బండ్లతోను, కొందరు కుటుంబాలతో, కొందరు ఒంటరిగా విజయాన్ని చూడటంకోసం వచ్చిన కాంగ్రెస్ సభ్యుల బండ్లతోను వుద్యోగుల బండ్లతోను క్రిక్కిరిసిపోతున్నవి. దారుణమయిన ఓటమి కలుగుతున్న సమయంలో చీకటి పడింది. కార్నెగీ వాషింగ్టన్ వెళ్ళటంకోసం బండి ఎక్కగానే కాల్పులచప్పుళ్లు మిక్కిలి సన్నిహితంగా వినిపించాయి. ఆ పిమ్మట అతడు చాలా వారాలు వాషింగ్టన్ లోనే వున్నాడు. అతనికి ప్రభుత్వంలోను, సైన్యంలోను వున్న ప్రముఖులందరితో పరిచయం కలిగింది. వీళ్ళల్లో అధ్యక్షుడు లింకన్ ఒకడు. అతడు తనకు సహజమయిన నిష్కాపట్య సౌజన్యాలు గల వ్యక్తిత్వంతో కార్నెగీని గాఢంగా ప్రభావితుడ్ని చేశాడు.

వాషింగ్టన్ లోని ప్రభుత్వం యుద్ధాన్ని గురించి మొదట కొద్ది వారాలల్లో ముగిసిపోయే చిన్న పొంగుమాత్రమే అని అనుకున్నది. అందువల్ల రైల్‌రోడ్‌కు సంబంధించిన స్కాట్, కార్నెగీల వంటి వారిని ఆత్యయిక పరిస్థితిని సరిదిద్దటం కోసమే త్వరితగతిని పంపించటం జరిగింది. నిశ్చేష్టులను చేసేటట్లు బుల్‌రన్‌లో కలిగిన వ్యతిరేకఫలం