పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


1861 వేసవిలో ఎన్నడూ ఎరగని ఎండలు కాశాయి. ఆమెరికాలోని నిరాఘ తాపానికి అతడు తట్టుకోలేగపోయినాడు. ఎక్కువసేపు ఎండలో గడపకుండా ఉండటంకోసం అతడు ఎంతో శ్రద్ద తీసుకో వలసివచ్చేది.

యూనియన్‌కు కనువిప్పును కలిగించిన బుల్ బరస్ యుద్ధం జూలై 21 న జరిగింది. ఆ రోజున కార్నెగీ సైన్యాలను ఆహారపదార్ధాలను, ఆయుధసామగ్రిని రైలుమీద యుద్ధరంగానికి చేరుస్తూ వాషింగ్టన్‌కు ఇరవై మైళ్ళదూరంలో వున్న బర్క్స్ స్టేషన్‌లో వున్నాడు. ముఖ్యనగరంలో శ్రుతిమించిన ఆత్మవిశ్వాసం రాజ్య మేలుతున్నది. అహంకారపూరితులైన దాక్షిణాత్యులను చులకనగా ఓడించవచ్చుననీ, ఆ చిన్ని తిరుగు బాటును అంతమొందించవచ్చునని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది.

బర్క్స్ స్టేషన్‌లో రోజంతా తీవ్రంగా శ్రమపడవలసి వచ్చింది. అంబ్యూలెన్సు శకటాలు తీసుకోవస్తున్న క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణం ఊరికే పెరిగిపోతున్నది. వాషింగ్టన్ నుంచి ఇంజన్‌లను, కార్లను తెప్పించి వారిని నగరంలోను, పరిసరాలలోను ఉన్న వైద్యశాలలకు చేర్చే ఏర్పాటు చేయించవలసివచ్చింది. యుద్ధభూమినుంచి వచ్చిన తొలి వార్తలు ఆశాజనకంగానే వున్నవి. మధ్యాహ్నమయ్యేటప్పటికల్లా పరిస్థితిలో మార్పు కన్పించింది. కొందరు దళాలుగాను, కొందరు ఒంటరిద్రిమ్మరులుగాను తిరోగమించివస్తున్న