పుట:Aandhrakavula-charitramu.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

71

నన్నయభట్టు

శ్లో. మార్గదేశివిభాగేన సంగీతం ద్వివిధం మతిమ్|
    ద్రుహిణేన యదుద్దిష్టం యదుక్తం భరతేన చ |
    తద్దేశీ హి యయా రీత్యా యత్స్యాల్లోకాసురంజసమ్ |
    దేశేదేశే ను సంగీతం తద్దేశీత్యభిధేయతే ||

అని సంగీత దర్పణమునం దుదాహరింపబడినది. బ్రహ్మచేతిను భరతుని చేతను సంస్కృతమున విధింపబడినది మార్గకవిత యనియు, కర్ణాటాది దేశములయందు నా యా దేశభాషలలో నేర్పఱుపఁ బడినది దేశికవిత యనియు, పయిదానితాత్పర్యము. ఈ సత్యాశ్రయుడు పూర్వ చాళుక్య రాజ్యమును స్థాపించిన కుబ్జవిష్ణువర్థనుని యన్నయే యైనచో నన్నయభట్టునకుఁ బూర్వ మాఱు నూఱుసంవత్సరముల క్రిందటనే తెలుఁగు కవిత్వ మారంభమయినట్లు తెలియవచ్చుచున్నది. కుబ్జవిష్ణువర్థనుఁడు వేంగీదేశము నకుఁ బరిపాలకుఁడుగా నియమింపఁబడుటకు ముందు సత్యాశ్రయుడు కర్ణాట వేంగీ దేశములకు రెంటికిని నేకచ్చత్రాధిపతియయి, తన రాజ్యకాలములో కర్ణాటాంధ్ర భాషలను రెంటిని బ్రోత్సాహపఱచెను. ఈతని తరువాతి వారైన కుబ్జవిష్ణువర్థనాది చాళుక్యరాజులు సహిత మట్లే చేయుచు వచ్చినందున వారియాస్థానములయందలి విద్వాంసులు సామాన్యముగ సంస్కృత కర్ణాటాంధ్రభాషావేత్తలగు చుండిరి. నారాయణభట్టు వలెనే నన్నయభట్టును తెలుఁగునందు మాత్రమే కాక కన్నడమునందున పాండిత్యము కలవాcడయి యుండెను. కర్ణాటక భాషా సంపర్కము చేతనే యా కాలము నందలి కవిత్వములో నక్కరలు మొదలైనవి విశేషముగా వాడబడుచుండెను. రాజరాజనరేంద్రునకుఁ బూర్వము నూఱుసంవత్సరముల క్రిందట బేట విజయాదిత్యుని కుమారుడైన వేఱొక సత్యాశ్రయు ( డుండెను గాని యతఁడు __________________________________________________________________________ * మార్గ కవిత - ప్రాచీన సంస్కృత సాహిత్య మార్గానుసార లక్షణ లక్షితమగు దేశ భాషా కవిత -దేశి కవిత - దేశీయ సంప్రదాయ బహుళంబగు కవిత మును మార్గ కవిత లోకమున వెలయగా దేశి కవితయను తెనుంగునఁ బుట్టించి ఆంధ్ర దేశమున నిలిపిన వాటు చాళుక్యరాజులు. వీరు మొదలుగ పలువురు(చోళాదులును) అట్లు చేసిరి. ఆంధ్రము విషయము, అందు తెనుంగన దేశి కవిత ఫుట్టించి తెనుంగు భాషను నిలిపిన వారు చాళుక్యరాజులు, 'సత్యాశ్రయయిని చొట్ట' యను 'చా' లోని పాఠమునకు మూల మెట్టిదో తెలియరాదు )