పుట:Aandhrakavula-charitramu.pdf/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

72

ఆంధ్ర కవుల చరిత్రము

రాజుగాక కేవలమాండలిక పరిపాలకుఁడై యుండుటచేతఁ కుమారసంభవము నందుఁ బేర్కొనఁబడిన సత్యాశ్రయుడీతడయి యుండడు. క్రీస్తు శకము 927 మొదలుకొని 934 సంవత్సరము వఱకు ననఁగా రాజరాజనరేంద్రుని కంటె నూఱు సంవత్సరములు ముందుగా రాజ్యము చేసిన యుద్దమల్లుని దానశాసనములలో నొక దానియందు

                      మ ధ్యా క్క ర లు

1. స్వస్తి నృపాంకుశాత్యంతవత్సల సత్యత్రిణేత్ర
      విస్తరణ శ్రీయుద్ధమల్ల డనవద్య విఖ్యాతకీర్తి
      ప్రస్తుతరాజాశ్రయండు త్రిభువనా భరణుండు సకల
      వస్తు సమేతుండు రాజసల్కిభూవల్లభుం డరి.


2. పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుఁడై గుడియు
      నిరుపమ మతి నృపధాము డెత్తించె సెగిదీర్చె మఠము
      గొరగ ల్గా లిందు విడిచి, బృందంబు గొనియుండువారు
      ..రిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.

3. వెలయంగ నియ్యొట్టు డస్సి మలినురై విడిసిన బ్రోల
      గల తానపతులను రాజు పట్టముం గట్టిన పతియు
      గలియం బై వారల వెల్వరించిన నశ్వమేధంబు
      ..ల ముపేక్షించి నాగలింగబడసిన పాపంబు దమకు.

4. జననుత చేబ్రోలనుండి బెజవాడ జాత్రకు వచ్చి
      త్రిణయనసుతుఁ డొండుచోటు మెచ్చక తివిరి యిన్నెలన
      యనఘుండు చేకొని యిందు ప్రత్యక్షమై యున్న సచ్చ
      గని మల్ల డెత్తించె గుడియు మఠమును గార్తికేయునకు.

5. రమణతో బెజవాడ కెల్ల బెడగును రక్షయం గాను
      దమతాత మల్లపరాజు వేర్వేఱు దాను గట్టించె
      గ్రమమున దానికి కలశ మిడ్డట్లుగా మొగమాడు
      నమరంగ శ్రీయుద్ధమల్ల డెత్తించె నమిత తేజుండు.