పుట:Aandhrakavula-charitramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

69

న న్న య భట్టు

క. నీకరవాలము పాలై
నాకంబున కరిగి రాజనారాయణ యా
భూకాంతు లెంతచనువో
నాకవితో త్తముల దూల నడఁదురు కడిమిన్ *

రాధా అను పద్యములను కవియుదాహరించి యున్నాఁడు. దీనినిబట్టి వేములవాడ భీమకవి కావ్యాలంకార చూడామణిని కృతి నందిన విశ్వేశ్వరరాజు కాలము లోనో, తరువాతనో యుండి యుండవలెను విశ్వేశ్వరరాజు రాజారాజనరేంద్రున కేడవ మనుమఁడగుటచేత రాజరాcజనరేంద్రుని కాలములోనున్న నన్నయ భట్టాఱుతరముల తరువాతఁ బుట్టిన విశ్వేశ్వరరాజు కాలములో నుండిన భీమకవి చేసిన రాఘవపాండవీయము నడఁచుట సంభవింపనేరదు కాcబట్టి తన రాఘవపాండవీయము నడఁదిన గ మనసులోఁ బెట్టుకొని భీమకవి నన్నయభట్టారకుని యాంధ్రశబ్దచింతామణిని గోదావరిలో గలిపెననుటయు దానిని సారంగధరుడు మరల నుద్దరించె ననుటయు నిరాధారము లయిన యసత్య కల్పనము లనుటకు లేశమాత్రమును సందేహము లేదు. కవి జనాశ్రయములోని యీ పద్యములు భీమకవి నన్నయభట్టున కాఱుతరముల ననఁగా నించుమించుగా నిన్నూఱు సంవత్సరముల తరువాత నున్నట్టు నిరాక్షేపముగా స్థాపించుచున్నవి. భీమకవియు నధర్వణాచార్యుఁడును గూడ నన్నయభట్టారకునికిఁ దరువాతి కాలము వారని యేర్పడుటచేత నీర్ష్యాగ్రస్తు డని జనులన్యాయముగా నారోపించిన నిందనుండి విముక్తుఁడయి, నన్నయభట్టారకుఁడనింద్య చరిత్రుఁడగుచున్నాఁడు.

నన్నయభట్టే యాదికవి యైనట్టుగా నిటీవలి తెలుఁగుకవులచేత గొనియాడఁబడుచు వచ్చినను, వాగనుశాసనునకుఁ బూర్వమునందుఁ దెలుగుఁకవులు లేకపోలేదు. అయినను పూర్వకవులు చేసిన గ్రంధములు మాత్ర మిప్పుడేవియు నేత్రగోచరములు కాకున్నవి. ఏ హేతువుచేతనో యా కాలపు పుస్తకము లన్నియు నశించి యుండును. ఆంధ్రదేశమంతయు నొకసారి __________________________________________________________________________ * ఈ లక్ష్యములు కొన్ని ప్రతులలో లేవనియు, తరువాత నెవ్వరో కవిజనాశ్రయములోఁ గలిపినారనియు, ఒకరు వ్రాయుచున్నారు,