పుట:Aandhrakavula-charitramu.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

64

ఆంధ్ర కవుల చరిత్రము

లేని సిద్ధుఁడొక్కడు తిక్కన కేతనాది సుప్రసిద్ధాంధ్రకవులకును పెద్దనాది లక్షణవేత్తలకును నెవ్వరికిని బహుశత సంవత్సరముల నుండి పేరైనను దెలియకుండిన తెలుఁగు వ్యాకరణ సూత్రములను దెచ్చి డీక చేయు మని మతంగగిరికడనే తానా వఱకెఱుఁగని బాలసరస్వతుల కిచ్చెను. దేశాటనము చేయుచుండిన సిద్ధుఁ డీ యవూర్వాంధ్ర వ్యాకరణమును మోక్షదాయకమైన యోగసిద్ధాంత గ్రంధమని సంపాదించి తెచ్చి యిచ్చెనా ? తనకుఁ గల సామాన్యాంధ్ర భాషాభిమానమునుబట్టి వెదకి తెచ్చి యిచ్చెనా ? మఱియే హేతువుచేత తెచ్చి యిచ్చెను ? నిజ మారయఁగా బాలసరస్వతియే తాను దీనిని రచియించి గ్రంధ ప్రామాణ్య సంసిద్ధిని కధను గల్పించి యుండును. గ్రంధ ప్రాశస్త్యార్థమైన యెడల, కర్తృత్వమును తానే వహించి యాకీర్తిని తానే పొందక నన్నయభ ట్టుకే యేల యారోపింపవలయుననియు, ఆరోపింప దలఁచిన యెడలఁ దనవంశములోనివాఁడైన నన్నయ కారోపింపక నన్నయ భట్టునకే యేల యారోపింపవలయుననియు, మన మిత్రు లడుగుచున్నారు. పుస్తకమునకుఁ గలిగిన ప్రమాణత్వ మంతయు నన్నయభట్టుయొక్క గొప్ప తనమువలన వచ్చినదే కాని స్వయో గ్యత వలన వచ్చినది కాదు. దీనినే బాలసరస్వతి కృతమని కాని తత్ప్రపితా మహకృతమని కాని చెప్పినచో నెవ్వరు ప్రామాణిక బుద్ధితో నాదరించి దానిని బహూకరింతురు ? గ్రంథము యొక్క యర్హతను బట్టియే చూచెడు పక్షమున, అధర్వణకారికావళి దీనికంటె శతగుణము లధిక గౌరవార్హమయినదిగా నుండును నే నీ పుస్తకము నన్నయ కృతము కాదన్నది పుస్తకములోని యంతస్సాక్ష్యమునుబట్టిగాని బీఠికలోఁ జెప్పఁబడిన దానినిబట్టి కాదు. ఇఁకఁ బీఠికలోని విషయ విచారమునకు వత్తము.

మొదటి పద్యములో "యుగాది సంభవుండై మని చెన్ననన్నన మహాకవి యెవ్వఁడు ? " అని యున్నది. అప్పటి కయిదాఱునూఱుల సంవత్సరముల క్రిందట నుండిన నన్నయ యెక్కడ ? యుగాది యెక్కడ ? ఈతడు కలిగించిన భ్రమలోనే పడి యప్పకవి కలియుగమున కాదిని నన్నయ రాజమహేంద్రవరములో నుండెనని చెప్పెను. రెండవ పద్యములో "పెక్కు