పుట:Aandhrakavula-charitramu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1]

63

న న్న య భట్టు


పయి వాక్యము లందుండినవో లేవో కాని బాలసరస్వతీయము మాత్రము వా రనుకొన్నట్లుగాక యెల్లవారికిని నెల్లచోటులను లభ్యమగుచునేయున్నది. బాలసరస్వతీయము చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునం దున్నది. పూర్వ మాంధ్రశబ్దచింతామణిని చెన్నపట్టణములో ముద్రించినవారు పుస్తక ముఖపత్రమునందు

      "ఆంధ్రభాషను సలక్షణముగా నభ్యసించుటకు
       ముఖ్యసాధనముగా నుండెడు నన్నయభట్ట ప్ర ణీ
       తాంధ్రశబ్ద చింతామణి
       యను నాంధ్ర వ్యాకరణ గ్రంథము
       ఎలకూచి బాలసరస్వతి యను నుత్తమ పండితునిచే
       నాంధ్రంబున రచియింపంబడిన బాలసరస్వతీయమను
       టీకతోఁ జేర్చి
       పురాణం హయగ్రైవ శాస్త్రులుగారిచే
       లేఖక ప్రమాదజనిత దోషంబులవల్లం బరిష్కరింపంబడి
       ప్లవంగసంవత్సరాశ్వయుజ శుద్దాష్టమియందు
       వివేకాదర్శ మనుస్వకీయ ముద్రాక్షరశాలలో
       అచ్చు వేయింపంబడెను.
                                       దీని మూల్యము అణాలు 12"

అనియు, పుస్తకాంతమునందు
        "బాలసరస్వతీయ టీకా సహీతాంధ్రశబ్ద
         చింతామణి గ్రంధము సంపూర్ణము"
         అనియు, ముద్రించి యున్నారు, అది యటుండనిండు.

ఆప్పకవియు నహోబలపండితుడును చెప్పిన ప్రకారముగా నన్నయభట్టు రచించి నప్పడు పఠించిన సారంగధరుడే సిద్దులలో గలిసి తనకు ముఖస్థ మయి స్వాధీనములో నుండిస పుస్తకమును దెచ్చి మతంగగిరికడ బాలసరస్వతుల కిచ్చెను. ఈ పుస్తక పీఠికను బట్టి పుస్తకముతో సంబంధమేమియు