పుట:Aandhrakavula-charitramu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1]

63

నన్నయభట్టు

వత్సరము లంతర్భూతమైయున్న యీ తెలుఁగు వ్యాకరణంబు నాకొసఁగె" నని యున్నది. పెక్కు సంవత్సరము లనఁగా నచ్చట పెక్కువందల సంవత్సరము లని యేమో ! రచియింపఁబడిన తరువాత గ్రంథము నిజము గానే పెక్కు సంవత్సరము లంతర్భూతమై యుండెనేమో ! తెలుఁగు వ్యాకరణ మనుచో మొదటి దేగణము ? గువర్ణ మెట్లు గురువగును ? కడపటి వచనములో 'సకల కవితా ప్రవర్తకుండగు శబ్ద శాసనం" డనుట ఆంధ్రశబ్ద చింతామణి గద్యములో నున్న "సకల భాషావాగనుశాసన"యను దాని కనుకూలముగా నుండుట కొఱకా ? మఱి యెందుకొఱకు ? "తత్సూత్ర విభాగంబును . .... దదుదాహరణ స్వరూపంబును నంధ్రమయ గద్య పద్యంబుల నేర్పరించి" యని యున్నది గదా? ఇది సత్యమా యసత్యమా సూత్ర విభాగములు మొదలయినవి యెన్ని పద్యములుగా నున్నవి ? పుస్తకములోని యంతస్సాక్ష్యమును నిరాకరించి యీ పీఠికలోఁ చెప్పఁబడిన దానినే వేదవాక్యముగా నంగీకరించుట యీ కల్లపలుకులను నమ్మియా ? నన్నయ భట్టారకుఁడు భీమకవి యెుక్క- రాఘవపాండవీయము నడఁచుటచే నతఁడు నన్నయభట్టీయమును గోదావరిలోఁ గలిపె నన్న యప్పకవి కధ కల్పిత మనుటను గూర్చి యిూ సందర్భమున నిఁక గొంచెము చెప్పవలసి యున్నది. ఈ క్రింది శ్లోకములతో నప్పకవి కధనే యహోబలపండితుఁడును జెప్పి యున్నాడు.

            శ్లో. నే యం కృతి ర్వేములవాడ భీమ ప్రబంధకర్త్రా హితమత్సరేణ 
                గోదాజలే నాశ మవాపితాభూ దిత్యుద్గతాసీ ద్భువి కింవదంతీ
            *     *     *     *    *
                రాజరాజ తనూజాతః సారంగధర బాలకః
                న కృతః పాణినాదేవ రహితోజని హేతునా
                మత్స్యేంద్ర నామసిద్ధేంద్ర మహిమా సిద్ధతాంగతః
                జగ్రాహ వ్యాక్రుతిం తస్మా త్కవిబాలసరస్వతీ  
                ఎలకూచి కులాంభోధిశరద్రాకానిశాకర
                సమస్త కవితాదక్షో వత్సరే కీలకాహ్వయే