Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

ఆంధ్ర కవుల చరిత్రము

         క్కని దcడము గొని పాములఁ
         గనినప్పుడ యడువఁ దొడఁగె గహనములోనన్. [ఆ. 1-52 ]

అని భవిష్యదర్ధమున "చేయదు" ననియు, నన్నయభట్టు ప్రయోగించెను. శబ్దశాసను కవిత్వములో నుండి వర్ధమానార్థకమున కున్నానుబంధముగాని, భవిష్యదర్ధమునకు కలానుబంధముగాని, వచ్చిన రూపము నొక్కదానినై_నను జూపగలరా ? ఇది యొక్కటికయే యాంధ్రశబ్ద చింతామణి నన్నయభట్ట విరచితము కాదని స్థాపించుటకుఁ జాలినంత ప్రబల ప్రమాణము కాదా ?

    "ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో
          నేది వచింపఁగాcబడియె నెందును దానినే కాని సూత్రసం
          పాదనలేమిచేఁ దెలుగుఁపల్కు మఱొొక్కటి గూర్చి చెప్పఁగా
          రాదని దాక్షవాటికవిరాక్షసుఁడే నియమంబు చేసినన్."

      క. ఆ మూఁడు పర్వములలో
          నామాన్యుఁడు నుడువు తెలుఁగు లరసికొని కృతుల్
          దాము రచించిరి తిక్కసు
          ధీమణీ మొదలై న తొంటి తెలుగు కవీంద్రుల్.
                                  [అప్పకవీయము, పీఠిక 46. 43}

అనునట్లు తెలుఁగు వ్యాకరణము లేకపోవుటచేత నన్నయభట్టారకుఁడు చేసిన
ప్రయోగానుసారముగానే కాని వేఱు విధముగా పదప్రయోగము చేయఁగూడ దని కవిరాక్ష సుఁడు చేసిన నియమమునుబట్టి తన్మతానుసారముగానే తిక్కనాదులు తెలుఁగుకావ్యములు రచించి రనుటయు,

       "శ్లో. అధర్వణాని కాణ్వాని బార్హస్పత్యాని సంవిదన్
            కౌముదీ మాంధ్రశబ్దానాం సూత్రాణి చ కరోమ్యహమ్"

      అని యాంధ్రకౌముది కర్తయు,

       "శ్లో. బార్హస్పత్యాని సర్వాణి కాణ్వం వ్యాకరణం విదన్
            కరో మ్యాధర్వణం శబ్దం సర్వలక్షణలక్షితం."

అని త్రిలింగ శబ్దానుశాసనకర్తయు, లక్షణ గ్రంధకర్తలైన యితరాంధ్ర లాక్షణికులును, పూర్వాంధ్ర వ్యాకరణ కర్తలపేరు లుదహరించి బాలసరస్వతి