పుట:Aandhrakavula-charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


55

నన్నయభట్టు

కాలమువఱకు నెవ్వరును నన్నయభట్టు పేరెత్తక పోవుటయు, ఇప్పటి యాంధ్రశబ్ద చింతామణి నన్నయకృతము కాదని సహస్రముఖముల ఫెూషించుచున్నది. పై శ్లోకములలో సుదాహరింపఁ బడిన బృహస్పతి శారదాదర్పణ గ్రంధకర్తయని చెప్పుచున్నారు.

తిక్కనసోమయాజి కాలమునం దివియే వర్తమాన భవిష్యదర్ధక రూపము లుగాఁ బరిగణింపబడుచున్నట్లు కేతన కృతియైన యాంధ్రభాషా భూషణ మీ క్రింది పద్యములతో ఫెూషించుచు

      

       క. డును, దరు,లొరులకు, నెదిరికిఁ
             దనరంగాదు, దవు, దరులు, తనకుఁ దను, దముల్,
             చను నేకబహువచనముల
             మనుసన్నిభ! క్రియల వర్ధమానార్థములన్. [ప.142 ]

     క. అడిగెడు నడిగెద రనఁగా
             నడిగె దడిగెదవు ధనంబు నడిగెద రనఁగా
             నడిగెద నడిగెద మనఁ బొ
             ల్పడరంగా వరుసతో నుదాహరణంబుల్. [ప.143]

        క. ఉను, దురు, లొరపలొరులకుఁ జెప్పను;
             ననరఁగ దువు, దురు, లేదిరికిఁ దనకు దును, దుముల్
             తనరఁగ నీవి యేకబహువ
             చనము లగు భవిష్యదర్ధకసంసూచకముల్. [ప.144
      
        క. పలుకును బలుకుదు రనఁగాఁ
             బలుకుదువు పలుకుదువు రనఁగఁ బలుకుదు నర్థీన్
             బలుకుదు మనఁగా నిన్నియు
             నలఘుమతీ ! వరుసతో నుదాహరణంబుల్. [ప, 145]

ఈ ప్రకారముగానే విన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడామణి యందు
 " వ ప్రధమ పురుషంబునకు వర్ధమానార్ధమునందు నేకవచన బహువచనంబులకు నెడినెదరు లును మధ్యమపురుషంబులకు నెదవేదరులును నుత్తమ