పుట:Aandhrakavula-charitramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49

నన్నయభట్టు

మొట్టమొదట రాజరాజనరేంద్రునకు సారంగధరుఁడన్న కొడుకుండె నన్న మాటయే సంశయింప వలసి యున్నది . *రాజనరేంద్రుని శాసనము లలోఁ గాని యాతని సంతతివారి శాసనములలోఁ గాని రాజనరేంద్రునకు రత్నాంగి యను భార్య కాని సారంగధరుఁ డను పుత్రుఁడు గాని యుండి నట్లెచ్చటను జెప్పఁబడి యుండలేదు. ఆందుచేతసారంగధరనామము గల రాజరాజపుత్రుఁడే లేఁడనియు, ఇటీవలి కవులు చమత్కారార్థముగా సారంగధర చరిత్రమును సారంగధరునిఁ గూడా గల్పించిరనియు చెప్పవలసి యున్నది. మొదట సారంగధరుఁడే లేనప్పుడు వ్యాకరణము సతఁడు పఠించు టయు, బాలసరస్వతి కిచ్చుటయు కల్ల లే యగును. వేములవాడ భీమకవి నన్నయభట్టు కాలమునకుఁ దరువాత బహు సంవత్సరములకుఁగాని యుండిన వాడు కాకపోవుటచేత నా తcడా వ్యాకరణమునుగోదావరిలోఁ గలిపెననుటయు పెద్దకల్లయే.

నన్నయభట్టు క్రీ. శ.1023 వ సంవత్సర ప్రాంతముల యందున్న వాఁడు. ఆ కాలమునం దాంధ్రశబ్దచింతామణి రచియి కనబడ్డ ట్లెవ్వరు నెఱిఁగినట్టు నిదర్శనము కానరాదు. తరువాత రెండువందల సంవత్సరము లకుఁ బిమ్మటఁ దిక్కనసోమయాజి కాలములో నున్న యభినవదండి యా వఱకెవ్వరును దెనుఁగునకు శబ్దలక్షణమును (వ్యాకరణమును) జెప్పలేదు గనుక నాంధ్రభాషాభూషణంబును రచియించెద ననుటచేతఁ దిక్కనాదుల కాలమునందును నన్నయభట్టీయ వ్యాకరణము లేదు. శ్రీనాధులకాలము వఱకును ఆంధ్రభాషాభూషణమే లక్షణగ్రంధముగా వాడబడుచుండఁగా కేతనకు రెండు వందల సంవత్సరముల తరువాత వెల్లంకి తాతంభట్టు 'కవి చింతామణి’ __________________________________________________________________________ (*సారంగధరుని చరిత్రను బోలిన కథలు భారతదేశము నందలి వివిధ ప్రాంత ములకు సంబంధించినవి కలవు.గౌరన నవనాధ చరిత్రము నందును, చేమకూర వేంకట కవి "సారంగధర చరిత్ర" యందును ఇయ్యది మాళవ దేశమునకు సంబంధించి నట్లు చెప్పబడినది. సారంగధరుని తండ్రి రాజమహేంద్రుఁడగుట చేత వేఁగి ప్రభు వగు రాజ రాజున కీకథ యంటగట్టబడి యుండవచ్చును. సారంగధరుఁడు రాజరాజు పుత్రుడు కాఁడని చరిత్ర కారులు నిర్ణయించి యున్నారు )