పుట:Aandhrakavula-charitramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

ఆంధ్ర కవుల చరిత్రము

చేసెననియు, అట్లు కానియెడల కేతన, తాతంభట్టు, ముద్దరాజు రామన్న, అప్పకవి, కూచిమంచి తిమ్మకవి, మొదలయిన లక్షణగ్రంధకర్త లొక్కరయిన నీ హరికారికల మాటయయినఁ దలపెట్టకపోరనియు, ఇప్పటివారుకొందఱనుచున్నారు. ఇది యట్లుండఁగా కొంద రాంధ్రశబ్దచింతామణి నన్నయభట్ట విరచితము కాదనియు, అతఁడు చేసినదైన పక్షమున కేతనాది కవుల కది తెలియక పోవుటయు, కేతన తన యాంద్రభాషాభూషణమునందు

క. మున్ను తెలుఁగునకు లక్షణ
మెన్నఁడు నెవ్వరును జెప్ప, రేఁ జెప్పెద వి
ద్వన్నికరము మది మెచ్చఁగ
నన్నయభట్టాదికవి జనంబుల కరుణన్

గీ. సంస్కృత ప్రాకృతాదిలక్షణము చెప్పి
తెలుఁగునకు లక్షణము మున్నుదెలుప కునికి
కవిజనంబులనేరమి గాదు నన్ను
ధన్యుఁ గావింపఁ దలచినతలఁపు గాని,

అని చెప్పట తటస్థింప దనియు, అప్పకవి చెప్పినట్లుగా భీమన యాంధ్ర శబ్దచింతామణిని గోదావరిలోఁ గలిపినయెడల నాలుగయిదువందలసంవత్సరములవఱకు నడఁగి యుండి యిప్పటికి మూఁడు నాలుగు వందల సంవత్సర ముల క్రిందట బయలఁబడుట సంభవింప నేరదనియు, బాలసరస్వతులో మరియెవ్వరో దీనిని రచించి తమ గ్రంధ ప్రసిద్దికై కర్తృత్వమును నన్నయభట్టునం దారోపించి సారంగధరుడు తమకిచ్చెనన్న కథ కల్పించి రనియు, అభిప్రాయపడుచున్నారు. ఇది సత్యమనియే తోఁచుచున్నది. కాని యెడల, "నుమ్చోతో " ఇత్యాదిసూత్ర మాంధ్రశబ్దచింతామణియందు జొచ్చుటకు "హేతువు లేదు. * ఈ యసందర్భము నాలోచించియే యిటీవలి వారీ సూత్రమును పుస్తకమునుండి తొలగించి యుండ వచ్చును.


( * అథర్వణుని కారికావళి చింతామణి శేషగ్రంథమని పలువురి యభిప్రాయము.)