Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

ఆంధ్ర కవుల చరిత్రము

యను లక్షణ గ్రంధమును వ్రాసెను. అప్పటికి నన్నయభట్టీయముయొక్క యునికి యెవ్వరికిని దెలియదు. తరువాత నూఱు సంవత్సరములకు రాఘవ పాండవీయమునకు వ్యాఖ్యానముచేసిన ముద్దరాజు రామన్న కాలమునందుఁ గూడ కవిచింతామణియు, నాంధ్రభాషాభూషణంబును దప్ప తెలుఁగునకు వేఱు లక్షణ గ్రంథములు లేవు. ముద్దరాజు రామన్న 'కవిలోక సంజీవని' యను లక్షణమును రచియించెను. తరువాత నేఁబది సంవత్సరముల కుద్ఫవించిన బాలసరస్వతుల కాలమునం దనఁగా నన్నయభట్టారకుని మరణానంతరమున దాదాపుగా నాఱు వందల సంవత్సరముల కాంధ్రశబ్దచింతామణి బయలఁబడినది. అది బాలసరస్వతులకు లభించిన దన్న విధము కూడ మిక్కిలి యాశ్చర్యకరముగా నున్నది *[1] ఆప్పకవీయములోని యూ క్రింది పద్యములనుబట్టి నన్నయ భట్టీగ్రంధమును రచించుట యొక్క సారంగధరుఁడు తప్ప మఱిిియెవ్వరు నెఱుంగరఁట ! అతఁడు దండ్రిచేతఁ గాళ్ళు చేతులు నఱిిికి వేయఁబడి సిద్ధులలోఁ గలిసిన యైదువందల యేcబది సంవ త్సరములకుఁ దరువాత నెల్లూరి మండలములోని మతంగగిరియొద్దకు వచ్చి పుస్తకము రచింపబడునప్పడు తాను జిన్ననాఁడు పఠించి జ్ఞప్తినిబట్టి దానిని బాలసరస్వతుల కేకరువు పెట్టెనఁట ! నిపుణముగాc బరిశీలించినచో నింతకంటె విరుద్ధమైన కధ మఱిిియొకటి యుండదు. అప్పకవీయములోని పద్యములను జూడుcడు --

 
              గీ. రాజరాజనరేంద్రు తనూజుఁ డార్య
                 సఖుఁడు సారంగధరుడు శై_శవమునందు
                 నన్నయ రచించు నేడఁ బఠనం బొనర్చె
                 నన్యు లెవ్వ రెఱుంగ రీ యాంధ్రఫక్కి. [ఆ. 1 - 48 ]

              క. ఆ లోకసుతుఁడు మొన్నటి
                 కీలక సమ నామతంగగిరికడ నొసఁగేన్
                 బాలసరస్వతులకు నతఁ
                 డోలిఁ దెలుఁగుటీక దాని కొప్పుగఁ జేసెన్. [ఆ. 1 - 50 ]

  1. (* చింతామణిలో అప్పకవి పాఠములు వేఱు, బాలసరస్వతి పాఠములు విభిన్న ముద్రణములలో విభిన్నరీతుల నున్నవి.)