పుట:Aandhrakavula-charitramu.pdf/617

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

590

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

పోతన శ్రీనాధునికంటె నిరువది ముప్పదియేండ్లు చిన్నవాఁడు. వేంకటగిరి ప్రభువులకుఁ బూర్వుఁడయి యా కాలమునందు రాచకొండదుర్గాధీశ్వరుఁడయి యుండిన సర్వజ్ఞసింగమనాయఁడు భాగవతమును దన కంకితము చేయమని కోరగా బమ్మెర పోతరాజు నిరాకరించె నన్న కధకూడఁ బయి కాలమును స్థాపించుచున్నది. కాబట్టి పోతరాజు హూణశకము 1435-వ సంవత్సరము వఱకును జీవించి యుండును. అంతకాలము జీవించియున్న పక్షమున మరణకాలమునం దతనికి డెబ్బదియైదు సంవత్సరముల ప్రాయమయి యుండును. ఏ హేతువు చేతనో బమ్మెర పోతరాజవిరచిత మైన యాంధ్రభా గవతము విశేషభాగము నశింపఁగా వెలిగందల నారయ, గంగన మొదలైన వారాయా భాగములను పూరించినారు. కాని గ్రంధమట్లు నశించుటకు కారణ మిదియే యని నిశ్చయించుటకుఁ దగిన ప్రబలాధారములేవియుఁ గాన రావు. బమ్మెర పోతరాజు వ్యాసవిరచితభాగవతపురాణము నాంధ్రీకరించె నన్న వార్తను సర్వజ్ఞసింగమనాయఁడు విని యా కవిని తన యాస్థానమునకు రప్పించి గ్రంథమును కృతి యిమ్మని యడిగెననియు, అతఁడు తన గ్రంథమును నరాంకితము చేయనని రాజు ప్రార్థన నంగీకరింపకపోఁగా రాజు రోషముతో నాతని గ్రంధమును భూమిలో గోయి తీయించి పాతిపెట్టించె ననియు, శ్రీరామమూర్తి యా రాజుభార్యయొక్క స్వప్నములో వచ్చి భర్తను వేఁడుకొని భాగవతపురాణము లోకములో వ్యాపింపజేఁయ నియ్యకొల్పుమని యామెతోఁ జెప్పి పోయెననియు, ఆమె తన స్వప్న వృత్తాంత మును భర్తకు విన్నవించి పాతి పెట్టిన పుస్తకమును పయికి తీయింపఁగా నందలి తాళపత్రములు పురుగులు తిని బహుుభాగములు శిథిలమయి పోయి యుండెననియు, పిమ్మట గంగనాదికవులు చెడిపోయిన భాగములనెల్లఁబూరించి రనియు, కొందఱు చెప్పుచున్నారు. లక్ష్మణసారసంగ్రహమునందుఁ