పుట:Aandhrakavula-charitramu.pdf/618

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బమ్మెరపోతరాజు.

591

గూచిమంచి తిమ్మకవి చెప్పిన యీ క్రిందీ పద్య మీ కధ కుపబలముగా నున్నది.

         సీ. ఘనుఁడు పోతనమంత్రి మును భాగవతము ర
                    చించి చిక్రికి సమర్పించునేడల
             సర్వజ్ఞసింగయక్ష్మాపరుం డది తన
                    కిమ్మనీ వేఁడఁగా నీయకున్న
             నలిగి యా పుస్తకం బవనిఁ బాతించినఁ
                   జీవికి యం దొకకొంత శిథిల మయ్యెఁ
             గ్రమ్మర నది వెలిగందల నారప
                   రాజును మఱి బొప్పరాజు గంగ
             రాజు మొదలగు కవివరుల్ తేజ మెసఁగఁ
             జెప్పి రా గ్రంధములయందే తప్పు లొదవేఁ
             గాని పోతన కవీంద్రుని కవీతయందు
             లక్షణం బెందుఁ దప్పునా ? దక్షహరణ!

వేంకటగిరిరాజు అయిన వెలుగోటివారికి మూలపురుషుఁడైన బేతాళరెడ్డి కేడవతరమువాఁడై న సింగమనాయనికే కాని పదవతరముఁవాడైన యీ సింగమనాయనికి సర్వజ్ఞబిరుదము లే దని కొంద ఱనుచున్నారు. పోతరాజు భాగవతమును రచించి దానినెవ్వరికిని జూషక పదిలముగా దేవతార్చన పెట్టెలోఁ బెట్టిఁ పూజించుచుండినట్లును, అవసానకాలమునం దఁతడు తన కుమారునిఁ బిలిచీ తా నార్జించిన యా ధనమును కాపాడుమని చెప్పి కాల ధర్మము నొందినట్లును, తదనంతరమున కుమారుఁడు దానీనీ విప్పి శోధింపఁగా బాణ మను పురుగుచే గ్రంధపత్రములు తినబఁడి యున్నందున వెలి గందల సారయాదుల సాహాయ్యమున గ్రంథమును పూరింపించినట్లును, మఱికొందఱు చెప్పుచున్నారు. ఈ కడపటి వృత్తాంతమే కొంత మార్పుతో భాగవత పీఠికయందును వ్రాయఁబడి యున్నది. అందుఁ బోతనామాత్యుని పుత్రుండు కూడ నీపై తృకధనమును ముట్టక కపొడి తనయవసాన కాలము నందు వెలిగందల నారయకు జెప్పఁగా నతఁ డనంతర మా గ్రంథమును