578
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
రత్నాంబరంబు లేరాయఁడిచ్చు
గైలాసగిరిఁ బండె మైలారవిభుఁ డేఁగి
దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు ?
రంభఁ గూడె దెనుంగురాయరాహుత్తుండు
కస్తూరి కేరాజుఁ (బస్తుతింతు ?
స్వర్గస్థుఁ డయ్యె విస్సనమంత్రి మఱి హేమ
పాత్రాన్న మెవ్వనిపంక్తి గలదు ?
భాస్కరుఁడు మున్నె దేపునిపాలి కరిగిఁ
గలియుగంబున నిఁక నుండఁ గష్ట మనుచు
దివిజవివరుగుండియల్ దిగ్గు రనఁగ
నరుగుచున్నాఁడు శ్రీనాధుఁ డమరపురికి.
అవసానదశయం దిట్టి కష్టముల కెల్లను గారణము యౌవనదశయందుఁ గామవశముచేత స్వేచ్ఛగా విహరించి దేహమును ధనమును జెడఁగొట్టుకొన్న పాపఫలము తక్క వేఱొక్కటి గాన రాదు. నే నీవాక్యమును వ్రాసినందునకుఁ గినుక వహించి చిలుకూరి వీరభద్రరావు గారు తమ యాంధ్రుల చరిత్ర మూఁడవ భాగములో “కామోద్రేకము కలిగించు విధమున మిక్కిలి పచ్చిగా స్త్రీవర్ణనముల గావించి రసికజనమనోరంజనము గావించేడు కవులు లోకములోని విటపురుషుల దుర్వర్తనముల హాస్యప్రబంధరూపమునను ప్రహసనరూపమును వెల్లడించెడు కవులను, కామపరవశు లనియు వ్యభిచారులైన మహాపాపులనియు ... చెప్పవలసి వచ్చునుగదా ! " అని ద్వేషబుద్ధితో దురభిమానపూరితములైన యుక్తిరహితదూషణభాషణములను వ్రాసియున్నారు. ఇట్టి వాక్యరత్నములుపేక్షణీయములు. రసికజనమనోరంజనము సర్వకళాశాలవారిచే ప్రధమశాస్త్రపరీక్ష (F. A.} కును, శాస్త్రో పాధ్యాయపరీక్ష(M A ) కును పఠనీయ గ్రంథముగా నిర్ణయింపబడె