పుట:Aandhrakavula-charitramu.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

577

శ్రీనాథుఁడు

నప్పుడు విడిచి పెట్టిన మహానుభావుడు కేవలకృష్ణకధ యైన నందనందన చరిత్రమును రచించి యుండునా ? [1] శ్రీనాథుఁడు తన కాశ్రయులైన వేమారెడ్డియు, వీరభద్రారెడ్డియు మరణము నొందినతరువాతఁగూడఁ గొంతకాలము బ్రతికి యుండెను. ఆ కాలమునం దతఁడు కృష్ణాతీరము నందు బొడ్డుపల్లె యను నొక గ్రామము గుత్తచేసి నదీ ప్రవాహము వలన సస్యము పోఁగా గుత్తధనము రాజునకుఁ గట్టలేక వారిచేత బహువిధములయిన బాధలను పొంది తుదకు మిక్కిలీ బీదతన మనుభవించెను. ఈ సంగతులను మెకన్జదొరవారు సేకరించిన స్థానికచరిత్రములలో నుదహరింపఁబడిన శ్రీనాథకృతములైన యీ క్రింది పద్యముల వలన నెఱుఁగవచ్చును.

         సీ. కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెనుగదా
                         పురవీధి నెదురెండ పొగడదండ
             సార్వభౌముని భుజ స్తంభ మెక్కెనుగదా
                         నగరివాకిట నుండు నల్లగుండు
             ఆంధ్రనైషధకర్తయంఘ్రియుగ్మంబునఁ
                         దగిలియుండెనుగదా నిగళయుగము
             వీరభద్రారెడ్డివిద్వాంసుముంజేత
                         వియ్య మందెనునుగదా వెదురుగొడియ
   
             కృష్ణ వేణమ్మ కొనిపోయే నింత ఫలము
             బిలబిలాక్షులు తినిపోయెఁ దిలలుఁ బెసలు
             బొడ్డుపల్లె ను గొడ్డేఱి మోసపోతి
             నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు.

  1. * [శ్రీనాథుఁడు నందనందన చరిత్రమును రచియించి యుండ లేదని శ్రీ ప్రభాకర శాస్త్రి గారును, ఆంధ్రకవితరంగిణికారులును కూడ వ్రాసియున్నారు.] 'పురవీథి నెదురెండ పొగడదండ-' అను నెడల పొగడదండకు బదులుగా 'బొగడదండ' అని యుండవలయుననియు, ఇసుపబొగడలతోఁగూడిన దండయే శిక్షాసాధనమగును గానీ • 'పొగడదండ' శిక్షాసాధనము కాఁజాలదనియు నిర్ణయింపఁబడియున్నది. దీనిని సహృదయులందఱు నంగీకరించి యున్నారు. [చూ. భారతి - డిసెంబరు 1936]