573
శ్రీనాథుఁడు
మ. అని దేవర్షి బహుప్రకారమధురవ్యాహారసందర్భముం
బనిగొంచుఁడఁగఁ దండ్రిపార్శ్వమున సద్భావంబు లజ్ఞాభరం
బును మౌగ్ధ్యంబును దోఁప నస్రవదనాంభోజాతయై గౌరి య
ల్లన లెక్కించుచునుండెఁ బాణి నవలీలాపద్మపత్రంబులన్. ఆ 4
ఉ. ఎంచి నుతింప శక్యమె యహీశ్వరునంతటివానికై న ర
త్నాంచితరోచిరుద్గమనిర స్తరవీందుమరీచిజాలమున్
గాంచనకందరాయవనికాయుతవారిధరాంతరాళని
ర్వంచిత దేవతామిధునవాంచితమూలము శీతశైలమున్. ఆ 5
శా. ఆయా వేళల మౌనిభార్యలు గృహవ్యాపారలీలాభవ
త్కాయక్లేశము లుజ్జగింతురు లసత్కర్పూరరంభాతరు
చ్ఛాయన్ శీతలచంద్రకాంతమణిపాషాణ ప్రదేశంబులన్
వాయు ప్రేరణఁ బచ్చకప్పురము పై వర్షింప నక్కోనలోన్. ఆ 5
మ. వికట భ్రూకుటిఫాలభాగుఁడును బ్రస్వేదాఁబుపూర్ణాఖిలాం
గకుఁడుం బాటలగండమండలుఁడునై కల్పాంత సంహారరు
ద్రకఠోరాకృత దుర్నిరీక్షు డగుచుం దట్టించి దుర్వాసుఁ డు
గ్రకటాక్షంబున నింద్రుఁ జూచి పలికెన్ గాఢాగ్రహవ్యగ్రతన్ . ఆ 6
చ. జలధరమంతయై కరటిచందము గైకొని సూకరాకృతిన్
నిలిచి పికంబుతో దోరసి నేరేడుపండును బోలుపుట్టువై
కలశపయోధిమంధసముఖంబునఁ బుట్టిన యమ్మహాహలా
హలము క్రమంబున శివుని హ స్తసరోరుహ మెక్కె వింతయై.
ఉ. చక్కనివాఁడ వెంతయును జల్లనివాఁడవు భాగ్యరేఖఁ బే .
రెక్కినవాఁడ వీ విపిన మెక్కడ ? సుకుమారతాగుణం
బెక్కడ ? ఘోరవీరతప మీ యెలప్రాయమునందుఁ జేయు నే
యక్కట ! యెవ్వఁడైన సుకృతాత్ముఁడ వీ వొకరుండు తక్కఁగన్.
చ. అతులిత ధైర్య శౌర్యమహిమాద్భుతసాహసులై మహోగ్రతా
ప్రతతని శాతనిష్కృపకృపాణ విదారిత దేహులై రణ
క్షితిఁ బడి వత్తురైదుపది చేయక నాకయి యిట్టి నన్ను
నీ ఇతరులఁబోలెఁ గైకొనక యెంచెద విప్పుడు పాండునందనా. ఆ 3