పుట:Aandhrakavula-charitramu.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


33

న న్న య భ ట్టు

చోళదేశమును పరిపాలించిన కులోత్తంగచోడ దేవుని విజయములను దెలుపు చున్నది. రెండవది 1076 మొదలుకొని 1136 వ సంవత్సరము వఱకును కుంతల దేశమును పాలించిన పశ్చిమచాళుక్యరాజయిన (యాఱవ) విక్రమాదిత్యుని విజయములను దెలుపుచున్నది. ఈరాజు లిద్దఱును జిరకాలము సమకాలీనులుగా నుండుటయేకాక 1076 మొదలుకొని 1112 వరకును 36 సంవత్సరములు సమకాలిక ప్రజాపాలకులుగాcగూడ నుండిరి. "కళింగవిజయ" మను నర్థమిచ్చెడి పూర్వోక్తమయిన యఱవకావ్యములో రెండు సంవత్సరములు కళింగరాజు కప్పము కట్టుట మాని వేయఁగాఁ గులోత్తుంగచోడదేవుఁ డతనిని దండించుటకయి తన దండనాధులలో నొకఁ డయిన కరుణాకరపల్లవుని సైన్యముతో దండయాత్ర పంపినట్టొకచోటఁ జెప్పఁబడినది. చోళరాజ్య విషయమున విక్రమాదిత్యునకును గులోత్తంగచోడునికిని పలుమాఱు యుద్దములు జరుగుచు వచ్చి జయాపజయములు పర్యాయమున మాఱుచు వచ్చెను. తండ్రియైన ప్రధమసోమేశ్వరుఁడు రాజ్యపాలనము చేయుచుండఁగానే యన్న యయిన ద్వితీయ సోమేశ్వరుఁడు యువరాజుగా నుండఁగానే యీ విక్రమాదిత్యుఁడు చోళదేశము మీఁదికి జనకునిచే విజయయాత్రకుఁ బంపఁబడినట్టు విక్రమాంకదేవచరిత్రము చెప్పుచున్నది. మఱియొకసారి యితఁడు చోళులపై దండయాత్ర వెడలి నప్పుడు చోళమండలాధీశ్వరుఁ డీతని ధాటికి భయపడి తనకూఁతు నాతని కిచ్చి వివాహము చేసి సంధిచేసికొన్నట్టు చెప్పఁబడియున్నది. ఇటీవల నత్యల్పకాలములోనే దేశవిప్లవము సంభవించి చోళరాజు మరణము నొంది దేశ మరాజకముకాఁగా వెంటనే విక్రమాదిత్యుఁడు కాంచీనగరమునకు సేనలతో వచ్చి రాజద్రోహులను పాఱఁద్రోలి తనభార్య సోదరుని చోళ సింహాసనమునందు నిలిపి కంచిలోఁ దాను నెలదినములుండి స్వరాజ్యసీమ యైన తుంగభద్రాతీరమునకుఁ బోయెను. ఆతఁ డట్లడుగు తీయఁగానే కొన్ని దినములలోపలనే మరల నూతన దేశ విప్లవ మొకటి తటస్థించి యందు రాజయిన తన శ్యాలకుఁడు ప్రాణములు గోలుపోయెననియు, వేఁగి దేశా