పుట:Aandhrakavula-charitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

ఆంధ్ర కవుల చరిత్రము

చేసికొని, చోళ దేశముమీఁదనే యధికాదరము గలవాఁడయి తా నా దేశమును జయించినతోడనే తన రాజధానిని చోళ దేశమునకు మార్చుకొని, వేఁగి దేశమును పాలించుటకయి పాటరులను నియమించి రాజ్యాధికారమును వారికి విడిచిపెట్టెను. 1063 వ సంవత్సరమునందు వేఁగి దేశమును పాలించుట కయి కులోత్తుంగ చోడదేవుఁడు తన పినతండ్రియైన విజయాదిత్యుని నియమింపఁగా నతఁడు పదునేను సంవత్సరములు రాజ్యపాలనము చేసి వార్థకదశలో 1077 వ సంవత్సరమునందుc జోడ దేశమునకుఁబోయి చేరెను; అటుతరువాత 1077 వ సంవత్సరములోనే వేఁగిదేశ పరిపాలనము నిమిత్తము తన రెండవకొడుకైన రాజరాజును బంపి యతఁడక్కడ నుండ నొల్లక మరుసటి సంవత్సరములోనే తల్లిదండ్రులవద్దకు లేచి రాఁగా, 1078 వ సంవత్సరమునందు శ్రావణమాసములో తన మూడవ కొడుకైన వీరచోడదేవుని వేఁగి దేశ పాలకునిగాఁ బంపెను. ఈవీరచోడ దేవుఁడు(తొమ్మిదవ) విష్ణువర్ధనుఁడను బిరుదుపేరితో 1100 సంవత్సరము వఱకును వేఁగిదేశాధిపుఁడుగా నుండెను. కులోత్తంగచోడ దేవునికి విక్రమ చోడుఁడు, రాజరాజు, వీరచోడ దేవుఁడు మొదలుగాఁ గల కొడుకులును, రాజసుందరి యను కూఁతురును గలిగిరి. ఈ రాజసుందరి కళింగరాజయిన రాజరాజునకు భార్యయయ్యెను. కులోత్తంగచోళ దేవుఁడు 1063 మొదలు 1112 వఱకును నలువదితొమ్మిది సంవత్సరములు రాజ్యపాలనము చేసెను. చాళుక్యులు తాము చంద్రవంశజుల మనియు, చోళులు తాము సూర్య వంశజుల మనియు, చెప్పకొనుచుండినవారయినను, తండ్రివంశమున శుద్దచాళుక్యుఁ డయి చోళమండలమును జయించి చోళరాజ్యమును పాలించుచు చోళరా జనcబరఁగిన కరికాలచోడుఁడను కులోత్తుంగచోడుని సంతతివారు తాము సూర్యవంశ్యుల మని చెప్పకొనసాగిరి. ఆ కాలమునందు చరిత్రాంశములను తెలిపెడు పుస్తకములు రెండు పుట్టినవి. అందొకటి జయనకొండనిచే నఱవములోఁ జేయcబడిన 'కళింగట్టుపరణి'; మఱి యొకటి బిల్హణునిచే సంస్కృతమునఁ జేయబడిన "విక్రమాంకదేవచరిత్ర" ఇందు మొదటిది 1063 మొదలుకొని 1112 వ సంవత్సరము వఱకును