పుట:Aandhrakavula-charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

ఆంధ్ర కవుల చరిత్రము

ధీశుఁడయిన రాజేంద్రచోడుఁడు కాంచీపురరాజ్య మాక్రమించుకొనియెననియు, వార్త యాతని చెవిసోఁకెను. ఇది 1063 వ సంవత్సరమున ననుటకు సందేహము లేదు. ఈసారి శత్రుఁడల్పుఁడు కాకుండుట తలపోసి మహాప్రయత్నము చేసి విక్రమాదిత్యుఁడు వెంటనే తన యన్నయైన ద్వితీయ సోమేశ్వరునితోఁ గలిసి రాజేంద్రచోడుఁ డనఁబడెడు కులోత్తంగ చోడదేవునిమీఁదికి దండెత్తివచ్చెను. ఇరువురు రాజులకును ఘోరసంగ్రామము జరిగిన మీఁదట తాత్కాలిక జయము విక్రమాదిత్యునకే కలిగి రాజేంద్రచోడుడు పలాయనము నొందవలసినవాఁ డయ్యెను; కాని సోమేశ్వరుఁడు ప్రతిపక్షి చేతిలోఁ జిక్కి కారాబద్ధుఁడుగాc జేయబడెను. ఇటీవల చోళులకును చాళుక్యులకు ననఁగా పూర్వ చాళుక్యులకును పశ్చిమ చాళుక్యులకును చోళరాజ్యసంబంధమున యుద్దములు పలుమాఱు జరగుచు వచ్చెను. ఈ యుద్ధములు చోళ దేశముతో నిలువక వేంగీదేశమువఱకును గూడ వ్యాపించినట్టు కనఁబడుచున్నవి. ఈ యుద్ధములలో నొకసారి విక్రమాదిత్యుఁడు వేంగీదేశమును సహితము స్వాధీనము చేసికొన్నట్టు చెప్పఁబడినది. గోదావరీమండలములోని దాక్షారామములోఁ గల శాలివాహనశకము 1045, 1052 సంవత్సరములనాఁటి విక్రమాదిత్యుని శాసనములీ విషయమును గొంత స్థిరపఱచుచున్నవి. సాధారణముగా 'కళింగట్టుపరణి" కులోత్తుంగచోడుని విజయములను, 'విక్రమాంక దేవచరిత్ర" విక్రమాదిత్యుని విజయములను పొగడుచుండును.

29. విక్రమచోడుఁడు- ఇతఁడు కులోత్తంగచోడు డనఁబడెడు రాజేంద్రచోడుని జ్యేష్ఠకుమారుఁడు. ఇతఁడు కొంతకాలము వేఁగి దేశ పాలకుఁడుగా నుండెను. ఇతcడు తండ్రి యొక్క- మరణానంతరమున వేఁగి దేశము విడచి చోళరాజ్యమును వహించుటకుఁ బోయెనని యొక శాసనమున నున్నది. ఈతఁడు 1112 మొదలు 1127 వఱకు పదునేను సంవత్సరములు రాజ్యము చేసెను.

30. కులోత్తుంగ చోడదేవుఁడు - ఈ రెండవ కులోత్తుంగుఁడు విక్రమ చోడుని కొడుకు ఇతఁడు 1127 వ సంవత్సరమున రాజ్యమునకు