పుట:Aandhrakavula-charitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


31

న న్న య భ ట్టు

విష్ణువర్ధనులలో నెనిమిదివాఁడును అయి యుండెను "విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు" అని యాంధ్రభారతములో సహిత మీ రాజనరేంద్రునకు విష్ణువర్ధననామ మున్నట్లు చెప్పఁబడియున్నది. ఇతఁడు తన మేనమామ యగు రాజేంద్రచోళునికూఁతు రయిన యమ్మంగదేవిని వివాహ మాడెను. ఈ రాజరాజు శకసంవత్సరము 944 భాద్రపద బహుళ ద్వితీయాగురువారము ఉత్తరాభాద్రపదనక్షత్రమున ననఁగా క్రీస్తుశకము 1022 సంవ త్సరము ఆగష్టు నెల 16 వ తేదిని పట్టాభిషిక్తుఁఁ డయ్యెను. ఇతని తమ్ముఁడు విజయాదిత్యుఁడు ఈ యేడవ విజయాదిత్యుఁడు. కులోత్తుంగచోడ దేవుని కాలములో 1063 సంవత్సరము మొదలుకొని 1077 వ సంవత్సరము వఱకును వేఁగి దేశమునకు పాలకుఁడుగా నుండెను. ఈ రాజనరేంద్రుఁడు 1022 మొదలుకొని 1063 వఱకు నలువదియొక్క సంవత్సరములు రాజ్యపాలనము చేసెను. ఈతని పేరు గల యీతని రాజ్యకాలపు బంగారు నాణెము లీ నడుమను ఆరకాను, సయాము దేశములలోఁ గనిపెట్టబడినవి.

28. కులోత్తంగ చోడ దేవుఁడు- ఇతఁడు రాజనరేంద్రుని ప్రధమ పుత్రుఁడు. ఇతcడే రాజేంద్రచోడుఁడు. ఇతని మొదటి పేరిదియే యైనను, ఇతఁడు వేఁగి దేశరాజ్యభారమును వహించిన మొదటి సంవత్సరము లోనే చోళ దేశమునకు దండెత్తి దానిని జయించి స్వాధీనపఱచుకొన్న తరువాత కులోత్తుంగచోడదేవుఁ డనcబడుచు వచ్చెను. ఇతనికి రాజనారా యణుఁడని బిరుదు పేరు. ఈతనిని కరీకాలచోళుఁడనియు వాడుచు వచ్చిరి. మూడు తరములనుండి చోళరాజులకూఁతులను వివాహమాడుచు వచ్చుటచేత తమ తల్లులనుబట్టియు భార్యలనుబట్టియు చాళుక్యుల కంతకంతకు వేఁగి దేశమునకంటె చోళ దేశముమీఁద నభిమాన మెక్కువగుచు వచ్చెను. విమలాదిత్యుఁడు రాజరాజు కూతురై న కుండవాంబాదేవిని వివాహమాడి తన కుమారునకు రాజరాజని పేరుపెట్టెను; రాజరాజు తన మేనమామ మైన రాజేంద్రచోళుని కూతురైన అమ్మంగదేవిని పెండ్లియాడి తన పుత్రునకు రాజేంద్రచోడు డనియే నామకరణము చేసెను. తరువాతి రాజేంద్ర చోడుఁడును రాజేంద్రచోడుని కూతురైన మధురాంతక దేవిని పరిణయము