30
ఆంధ్ర కవుల చరిత్రము
క్రీస్తుశకము 945 వ సంవత్సరము డిసెంబరు నెల 5 వ తేదిని పట్టాభి షిక్తుడయినట్టు చెప్పఁబడి యున్నది. ఇతఁడు రాజపరమేశ్వరత్రిభువనాంకుశాదిబిరుదాంకములను గలవాఁడై 945 మొదలు 970 వఱకు నిరువదియైదు సంవత్సరములు భూపరిపాలన మొనర్చెను.
24. దానార్ణవుఁడు- ఇతఁడు రెండవ చాళుక్యభీముని జ్యేష్టపుత్రుఁడు; అమ్మరాజ విజయాదిత్యుఁని సవతియన్న, ఇతఁడు 970 మొదలు 973 వఱకును మూఁడు సంవత్సరములు రాజ్యము చేసెను. ఒక శాసనములో నితఁడు ముప్పది సంవత్సరములు రాజ్యము చేసినట్లుస్నదిగాని 973 మొదలు 1003 వఱకు ముప్పది సంవత్సరములు దేశ మరాజకమై యున్నట్లు బహుశాసనముల వలనఁ దెలియ వచ్చుచున్నది ఈ కాలములో చోళు లీ దేశమునకు దండెత్తివచ్చి గెలిచినట్టును, కొంతకొలము వేఁగిదేశమును పాలించినట్లును కనcబడుచున్నది*
25. శక్తివర్మ- ఇతఁడు దానార్ణవుని పెద్దకొడుకు. చాళుక్యచంద్రుఁ డన్న బిరుదు పేరు గలవాఁడు. ఇతఁడు 1003 మొదలు 1015 వఱకు పండ్రెండేండ్లు దొరతనము చేసెను. ఈతని బంగారునాణెములం ఆరకాను దేశమునందును సయాము దేశమునందును గనఁబడినవి.
26. విమలాదిత్యుఁడు- ఇతఁడు శక్తివర్మ తమ్ముఁడు. దానార్ణవుని రెండవకొడుకు ఇతఁడు రాజేంద్రచోడుని చెల్లెలును గంగయికొండ రాజరాజ రాజకేసరివర్మ కూఁతురును నగు కుండవాంబాదేవి** యను చోడరాజ కన్యను వివాహమాడి యామెవలన నాంధ్రభారత కృతిపతి యగు రాజ నరేంద్రునిఁ గనెను. ఈ రాజనరేంద్రునిది మాతామహుని పేరు విమలా దిత్యుఁడు. 1015 మొదలు 1022 వఱకు నేడు సంవత్సరములు ప్రభుత్వము చేసెను.
27.రాజరాజవిష్ణువర్ధనుడు- ఇతడే భారతకృతిపతి. విమలాదిత్యుని పుత్రుఁడై_న యితఁడు రాజరాజు లనఁబడెడువారిలో మొదటివాఁడును,
*రాజ్యమరాజకమైనదేకాని, చోళులు దీనిని జయించి పాలించిరనుట నిరాధారమని 'ఆంధ్రకవితరంగిణి' (పుట 101)
- ఈమె కుందవ దేవి యని కవితరంగిణి (పుట 108)