పుట:Aandhrakavula-charitramu.pdf/554

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

527

శ్రీనాథుఁడు

బోయి యచ్చటఁ దనకు పరాభవము కలుగకుండఁ జేయుమని శారదను వేఁడి యుండునా ? యని యొకరీ విషయమున సంశయపడుచున్నారు. దేవరాయాదులు మహారాజు లయినను, వారు పండితజనపరివేష్టితులే గాని స్వయముగా పండితులుగారు; ఇక నీ సింగమనాయఁ డన్న నో చిన్న సంస్థానాధిపతి యైనను పండితులవలనఁ గృతులనందుటయేకాక, తానును స్వయ ముగా కావ్యవిరచనసామర్థ్యముగలవాఁ డయి బహు శాస్త్రములయందుఁ బ్రవీణుఁడయి సర్వజ్ఞబిరుదమును వహించినవాఁడు. అటువంటివానియొద్దం దన పాండిత్యమును జూపుటకుఁ బోవునప్పు డెంతటి విద్వాంసుఁడై నను. కొంచెము జంకి, తనకు విజయ మియ్యవలసినదని తన యిష్టదైవతమును ముందుగాఁ బ్రార్థించుట యసహాజమగునా? శ్రీనాధునకు సరస్వతి యిష్ట దేవతయగుట నైషథమునందు గృతినాయకుఁడై న మామిడి సింగనామాత్యుఁడు తన్ను బిలిపించి పలికినట్లు చెప్పఁబడిన యీ శార్దూలములు ఘోషించుచున్నవి.

శా. భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంభసత్సూత్రు వి
    ద్యారాజీవధవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకుం
    గారామైన తనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
    త్కారం బొప్పఁగ గారవించి పలికె న్గంభీరవాక్ప్రౌఢిమన్.

శా. బ్రాహ్మీదిత్తవర ప్రసాదుఁడ పురు ప్రజ్ఞావిశేషోదయా
    జిహ్మస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత
    బ్రహ్మాండాదిమహాపురాణచయతాత్పర్యార్థనిర్దారిత
    బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే ?

సర్వజ్ఞ బిరుదము రావువంశ మూలపురుషుఁడైన బేతాళ నాయని కేడవతరమువాఁ డయిన సింగభూపాలునికే గాని పదవతరమువాఁ డయిన యీ సింగమనాయనికి లేదనియు, రసార్ణవనుధాకరాది గ్రంథములను రచించిన వాఁ డతఁడే కాని యితఁడు కాఁడనియు, కాలవ్యత్యాసమునుబట్టి సింగభూ