528
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
పాలీయాది గ్రంధకర్త యయిన సర్వజ్ఞసింగమనాయనికాలములో శ్రీనాధుఁ డుండి యుండఁజాలఁడనియు, అందుచేత నీ మహాకవి యీ సింగభూపాలుని యొద్ద నపజయము సంభవించునేమో యని భయపడవలసిన పని యుండ దనియు, కాఁబట్టి శ్రీనాధుఁడు సర్వజ్ఞసింగమనాయని యాస్థానమునకుఁ బోయెననుటయే యసత్యమనియు, కొందఱు వాదించుచున్నారు. ఆ విషయము నిచ్చట నించుక విమర్శింతము.
బేతాళనాయనికి నేడవ తరమువాఁడు సర్వజ్ఞసింగమనాయఁడగుటకు సందేహము లేదు; రనార్జ వసుధాకరాదిసంస్కృత గ్రంథములను రచించినవాఁడతఁడే యగుటకును సందేహము లేదు. శ్రీనాథపోతనార్యులాతని కాలపు వారు కాకపోవుటయు, నందుచేత నాతని యాస్థానమునం దుండకపోవుటయు నిశ్చయమే ! అంతమాత్రముచేత బదవ తరమువాఁడైన సింగమనాయఁడు విద్వాంసుఁడును సర్వజ్ఞ బిరుదాంకితుఁడును గాఁ డన్న సిద్దాంత మేర్పడనేరదు, ఇద్దఱును విద్వాంసులుకావచ్చును; ఇద్దఱును సర్వజ్ఞబిరుదాంచితులు కావచ్చును; ఇద్దఱును గ్రంధకర్తలు కావచ్చును, ఇద్దఱును కృతిపతులు కావచ్చును. వేదాంత దేశికులు సుభాషితనీవి లోనగు గ్రంధములను బంపిన వాఁడును, వైష్ణవ గ్రంధకర్తలు తమ వ్యాఖ్యానములలో సర్వజ్ఞ బిరుదనామముతోఁ బేర్కోనినవాఁడును బేతాళనాయని యేడవ తరమువాఁడయిన మొదటి సింగమనాయఁడే యయి యుండును. అయినను పదవతరమువాఁ డయిన సింగమనాయఁడును సర్వజ్ఞబిరుదాంకుఁడే ! ప్రౌఢదేవరాయని కాలములో నుండిన యీ సర్వజ్ఞ సింగమనాయని యాస్థానమున కే శ్రీనాథకవి సార్వభౌముఁడును, బమ్మెరపోతనామాత్యుఁడును పోయి యాతనిపయిని పద్యములను జెప్పి బహుమానములను బడసిరి. ఈ విషయము వెల్గోటివారి వంశచరిత్రములో నీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.
సీ. క్షితిలోస సర్వజ్ఞసింగభూపాలుడు
బలవైరిసన్ను తపౌరుషుండు